Share News

Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:56 PM

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. శ్రీకాళహస్తిలో చేపట్టిన ప్రచారంలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.

Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. శ్రీకాళహస్తిలో చేపట్టిన ప్రచారంలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ఆయన గురించి స్థానికులను అడిగితే ఆయన ఒక వసూల్ రాజా అని, ఒక్క పనీ చేయరు అని చెప్పారన్నారు. మట్టి, ఇసుక మాఫియా, కబ్జాలతో పేట్రేగిపోతున్నారని షర్మిల ఆరోపించారు. ఆయన ధాటికి పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతున్నాయని విమర్శించారు. ఇంత దోపిడీ చేస్తున్నా మళ్ళీ ఆయనకే టిక్కెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఓటు అడిగేందుకు వస్తారని, డబ్బులు ఎంత ఇచ్చినా తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. డబ్బు తీసుకున్నప్పటికీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడికే వేయాలని కోరారు. ఆలోచన లేకుండా ఓటు వేస్తే ప్రజలను బానిసలుగా చేసినట్లే అవుతుందని చెప్పుకొచ్చారు.


Elections 2024: జగన్ పై రాయి దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్..

ఐదేళ్లు వైసీపీకీ అధికారం ఇస్తే ఏం చేశారు..?. రాష్టానికి ప్రత్యేక హోదా రావాల్సి ఉంది. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రజలను మోసం చేశారు. పాలక పక్షం, ప్రతిపక్షం ఇద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు. హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారు. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై రాజధానులుగా ఉన్నాయి. కానీ మన రాష్ట్రానికి రాజధాని ఏది..?. రాష్ట్రంలో నిత్యావసర ధరలు బాగా పెరిగాయి. ఓ వైపు డబ్బులు ఇస్తూనే మరోవైపు గుంజుకుంటున్నారు. బటన్ నొక్కడం అంటే బహుశా ఇదే. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. అధికారంలో వచ్చాక మెగా డీఎస్సీ లేదు. జాబ్ క్యాలెండర్ లేదు.

- వైఎస్.షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు


Kodali Nani: పకడ్బందీగా గురి చేసి కొట్టారు.. కొడాలి నాని

ఎన్నికల ముందు కుంభకర్ణుడి లాగా సీఎం జగన్ నిద్ర లేచారని షర్మిల విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ ఎలక్షన్లు సమయంలో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని కోరారు. 10 ఏళ్లు హోదా ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ప్రతి పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష సహాయం అందిస్తామని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్.షర్మిల స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 14 , 2024 | 01:59 PM