Share News

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:52 PM

అమరావతి: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మే 10వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు అనుమతితో రాష్ట్రంలో పర్యటిస్తానని.. నిజం గెలవాలి కాకుండా మరో రూపంలో ప్రచారం చేస్తానని నారా భువనేశ్వరి వెల్లడించారు.

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

అమరావతి: ఏపీ (AP)లో ప్రజాస్వామ్యం ప్రమాదం (Democracy is a Danger)లో ఉందని, మే 10వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనుమతితో రాష్ట్రంలో పర్యటిస్తానని.. నిజం గెలవాలి (Nijam Gelavali) కాకుండా మరో రూపంలో ప్రచారం చేస్తానని నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ (Arrest) సమయంలో చాలా షాక్‌ (Shock)కు గురయ్యానని, సెప్టెంబర్ 9న చంద్రబాబుని అరెస్ట్ చేశారని.. 10న మా పెళ్లి రోజని (Wedding Day) అన్నారు. అయితే బాబు అరెస్టు విషయాన్ని కుమారుడు లోకేష్ (Lokesh) తనకు చెప్పారన్నారు. దాంతో తనకేమీ అర్థం కాలేదన్నారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ లోకేష్‌కు ఫోన్ చేసి అడిగానని, కొద్దిసేపు ఇబ్బంది పడినా చంద్రబాబు తప్పు చేయరని నమ్మకం తనకు ఉందని, అందుకే ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చానని భువనేశ్వరి తెలిపారు.


చంద్రబాబు అరెస్ట్‌తో అనేక మంది టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారని, బాబు చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చెప్పారని భువనేశ్వరి తెలిపారు. ఆయన సతీమణిగా తనకు ఎంతో అదృష్టం అనిపించిందన్నారు. లోకేష్ పాదయాత్రను ముందు తాను వద్దని చెప్పానని.. తర్వాత సైనికులను తలచుకొని ముందుకు వెళ్ళమని చెప్పానన్నారు. యువగళం తర్వాత లోకేష్ చాలా నేర్చుకొన్నారని, పాదయాత్రతో ప్రజల సమస్యల పట్ల అవగాహన పెరిగిందన్నారు. తనపై అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చాలా బాధ వేసిందన్నారు. ‘మా నాన్న ఇచ్చిన ధైర్యం.. మా అమ్మ నేర్పిన క్రమశిక్షణ... నాకు మనో ధైర్యాన్ని నింపిందని’ భువనేశ్వరి అన్నారు.


ఈనెల19వ తేదీన కుప్పంలో చంద్రబాబు నాయుడు తరపున నామినేషన్ వేస్తానని భువనేశ్వరి తెలిపారు. రెండు నెలల్లో కుప్పంలో గృహప్రవేశం చేస్తామని, చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక మరణించిన కార్యకర్తల కుటుంబాలను... పార్టీ తరపున తప్పనిసరిగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భువనేశ్వరి స్పష్టం చేశారు.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు... ‘ఈనెల 18న భువనేశ్వరి కుప్పం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త చంద్రబాబు తరఫున 19వ తేదీ మధ్యాహ్నం 12.33 గంటలకు నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఊరేగింపు నిర్వహించాలని నియోజకవర్గం పార్టీ సంకల్పించింది. నామినేషన్‌ దాఖలుకు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభంజనంలా తరలి రావాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.

Updated Date - Apr 14 , 2024 | 01:55 PM