Share News

Lok Sabha Elections 2024: దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - May 02 , 2024 | 05:10 PM

దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజపీ, ఆర్ఎస్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు చెప్పే సంప్రదాయం ఉందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2012నుంచి జనాభా లెక్కలు ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు.జనాభాతో పాటు కులగణన జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు.

Lok Sabha Elections 2024: దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

ఆసిఫాబాద్‌: దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజపీ, ఆర్ఎస్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు చెప్పే సంప్రదాయం ఉందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2012నుంచి జనాభా లెక్కలు ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు.జనాభాతో పాటు కులగణన జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బీసీలకు రిజర్వేషన్ల పెంపును అడ్డు కుంటోందని విరుచుకుపడ్డారు. రిజర్వేషనల్ రద్దు చేసేందుకే కులగణనను చేయడం లేదని ఏకిపారేశారు. పాలర్లమెంట్ ఎన్నికల్లో 400సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఉద్ఘాటించారు. బీజేపీకి వేసే ఓటు రిజర్వేషన్ల కు పోటని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీకి ఓటు వేస్తారా ప్రజలే తేల్చు కోవాలని అన్నారు. 10రోజుల నుంచి తాను ఈ విషయం చెబుతుంటే ఢిల్లీ పోలీసులు కేసులు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ గతంలో తనపై 100 కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తాను కేసులకు భయపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


Lok Sabha Elections 2024: కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ మంత్రి కాపాడుతున్నారు: బండి సంజయ్

ఆసిఫాబాద్‌లో గురువారం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పాల్గొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ‘జనజాతర’ భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆదివాసులపై బీజేపీకి ప్రేమ లేదని, వారిపై వివక్ష చూపుతోందని అన్నారు. గతంలో సోయంబాపు రావు ఎంపీగా గెలిపిస్తే బీజేపీ ఎలాంటి అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆదివాసుల పట్ల బీజేపీకి ప్రేమ ఉంటే ఇక్కడి ఎంపీకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని నిలదీశారు. చివరికి సోయం బాపురావుకు ఈ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వకుండా బీజేపీ అవమానించిందని ధ్వజమెత్తారు.


Big Breaking: అనంతపురంలో 2వేల కోట్ల నగదు పట్టివేత.. 4 కంటైనర్ల కథేంటి..!?

పేదోళ్లను బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ అవమానిస్తున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు జిల్లా అభివృద్ధికి ఏం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి సారిగా ఆదివాసీ మహిళకు ఎంపీగా అవకాశం ఇచ్చిందని తెలిపారు. మహిళలంతా కలిసి సుగుణను ఎంపీగా గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆదిలాబాద్ పార్లమెంట్‌లో సాగునీరు, పోడు భూముల సమస్య ఉందని చెప్పుకొచ్చారు.


Supreme Court: సీబీఐపై మా కంట్రోల్ లేదు.. సుప్రీం కోర్టుకు తేల్చి చెప్పిన కేంద్రం

తుమ్మడిహాట్టి ప్రాజెక్టు‌ను మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. సీసీఐ మూతపడితే కేసీఆర్, మోదీ పట్టించుకోలేదని మండిపడ్డారు. జిల్లాలో చాలా వనరులు ఉన్నా.. ఎలాంటి అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. విద్యా, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 3నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు కులగనణ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


Shashi Tharoor: బీజేపీ 300 కూడా దాటదు.. 400 ఒక జోక్

Read Latest Election News or Telugu News

Updated Date - May 02 , 2024 | 05:38 PM