Share News

Supreme Court: సీబీఐపై మా కంట్రోల్ లేదు.. సుప్రీం కోర్టుకు తేల్చి చెప్పిన కేంద్రం

ABN , Publish Date - May 02 , 2024 | 04:07 PM

సీబీఐపై తమ కంట్రోల్ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తేల్చిచెప్పింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 131 ప్రకారం ఈ కేసు వేసింది.

Supreme Court: సీబీఐపై మా కంట్రోల్ లేదు.. సుప్రీం కోర్టుకు తేల్చి చెప్పిన కేంద్రం

ఢిల్లీ: సీబీఐపై తమ కంట్రోల్ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తేల్చిచెప్పింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 131 ప్రకారం ఈ కేసు వేసింది.

సీబీఐకి(CBI) ఇచ్చిన సాధారణ సమ్మతిని రాష్ట్రం ఉపసంహరించుకున్నా దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తమ రాష్ట్రంలో కేసులను దర్యాప్తు చేస్తోందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనానికి రాజ్యాంగంలోని 131వ అధికరణం రాజ్యాంగంలోని అత్యంత పవిత్రమైన అధికార పరిధి అని, అందులోని నిబంధనలు ఉండవని చెప్పారు.


కేసులను భారత ప్రభుత్వం దాఖలు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని సొలిసిటరల్ జనరల్ తెలిపారు. సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని.. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదని వివరించారు. ఆర్టికల్ 131 అనేది కేంద్రం, రాష్ట్రాల అధికార పరిధికి సంబంధించింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం 2018లోనే రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు అనుమతిని ఉపసంహరించుకుంది. తద్వారా రాష్ట్రంలో సీబీఐ దాడులు ఆగిపోయాయి.

ఈ మధ్య సందేశ్ ఖాలీ వివాదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ ఈడీ బృందంపై దాడి జరిగింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీంతో తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతి లేకున్నా.. సందేశ్ ఖాలీ కేసును ఎలా విచారిస్తారని ప్రభుత్వ వాదన. దీంతో దీదీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Read Latest National News And Telugu News

Updated Date - May 02 , 2024 | 04:07 PM