Share News

Lok Sabha Elections 2024: కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ మంత్రి కాపాడుతున్నారు: బండి సంజయ్

ABN , Publish Date - May 02 , 2024 | 03:23 PM

మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.

Lok Sabha Elections 2024: కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ మంత్రి కాపాడుతున్నారు: బండి సంజయ్
Bandi Sanjay

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఈ కేసులో అధికారుల ప్రమేయం ఉండదని.. బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే ఈ తతంగామంతా జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీల నేతలు కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ కేసును డైవర్ట్ చేశాయన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్

ఆ కేసులు ఏమయ్యాయి...

‘‘సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది. ఈ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసును పక్కదారి పట్టించి, నిందితులను రక్షించేందుకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి యత్నిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ తీవ్రమైన అంశం. ఈ విషయంలో కాంగ్రెస్‌ సర్కారు తాత్సారం చేస్తోంది. సిరిసిల్ల కేంద్రంగా తనతో సహా సీఎం రేవంత్‌, మాజీమంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయి. 317 జీవో, టీఎస్‌పీఎస్సీ లీకేజీ విషయంలో పోరాడుతున్నందుకు నన్ను అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మియాపూర్‌ భూకుంభకోణం, నయీం, డ్రగ్స్‌ కేసు, టీఎస్‌పీఎస్సీ లీకేజీపై సిట్‌ విచారణ తాత్సారం జరిగినట్లే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో ప్రమేయం ఉన్న నిందితులను రక్షించేందుకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి యత్నిస్తున్నారు. కేసీఆర్‌ మాదిరిగానే రేవంత్‌రెడ్డి పాలన ఉంది. బీఆర్‌ఎస్‌ పాలనకు.. కాంగ్రెస్‌ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదు.’’ అని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీజేపీపై కుట్రలు..

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడబలుక్కున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఎప్పటికీ ఒకటిగానే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ పార్టీలు బీజేపీపై కుట్రలకు పాల్పడుతున్నాయన్నారు. తమ పార్టీపై సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఖూనీ చేస్తున్నాయని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌ నేతలకు డబ్బులు..

‘‘ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు ద్వారా ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలకు డబ్బులు అందాయి. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేందర్‌రావు ప్రస్తుతం అశోక్‌రావు ఇంట్లోనే ఉన్నారు. రాజేందర్‌రావు ఖర్చులన్నీ అశోక్‌రావే చూస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును స్థానిక పోలీసులతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలి. అప్పుడే నిందితులు, వారి వెనుక పెద్దలు బయటకొస్తారు. సీబీఐతో ఈ కేసును విచారణ జరిపించేందుకు ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏమిటి ? ఫోన్‌ ట్యాపింగ్‌తో కేసీఆర్‌, కేటీఆర్‌లకు ప్రత్యక్ష సంబంధం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఒకే హోటల్‌లో ఉన్నారు. సీబీఐకి అప్పగించలేదంటే ఈ కేసులో కాంగ్రెస్‌ ప్రమేయం ఉన్నట్లే. కరీంనగర్‌ మంత్రికి, కేసీఆర్‌ కుటుంబానికి సాన్నిహిత్యం ఏమిటి ?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

Loksabha Polls 2024: తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్త సమయం

Loksabha Polls 2024: ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా మద్యం పట్టివేత.. ఏయే ప్రాంతాల్లో అంటే?

Read Latest Election News or Telugu News

Updated Date - May 02 , 2024 | 04:48 PM