Share News

Praja Galam Live: నంద్యాలలో చంద్రబాబు ప్రజాగళం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:20 PM

నంద్యాల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బనగానపల్లెకు చేరుకున్నారు.

 Praja Galam Live: నంద్యాలలో చంద్రబాబు ప్రజాగళం

నంద్యాల: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రజాగళం యాత్ర (Prajagalam Yatra)లో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బనగానపల్లెకు చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద చంద్రబాబుకు బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ షో (Road Show) జరుగుతుంది. అనంతరం పెట్రోల్ బంకు సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్నీ ఏర్పాట్లు చేశారు. బనగానపల్లె మొత్తం పసుపు మయమైంది.

Updated Date - Mar 29 , 2024 | 12:32 PM