Share News

AP Politics: వైసీపీ ఘోరపరాజయానికి కారణం అదేనా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ..

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:21 AM

ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది.

AP Politics: వైసీపీ ఘోరపరాజయానికి కారణం అదేనా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ..
YS Jagan

ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధపొందిన లబ్ధిదారులు ఓట్లు వేస్తారని భావించిన జగన్ ఆశలు నెరవేరలేదు. ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేశామని జగన్ చెప్పుకున్న గొప్పలను ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి.. సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు అప్పులు చేయడం ప్రజలకు నచ్చలేదు. రాజధాని విషయంలో జగన్ నిర్ణయాన్ని ప్రజలు తప్పుపట్టారనేది ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.


సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేద, మధ్య తరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసినా ఓట్లు ఎందుకు పడలేదనే ప్రశ్నకు వైసీపీ నాయకులకే సమాధానం దొరకడంలేదట. వైసీపీ ఇంతటి ఘోర పరజాయానికి కారణం ఏమిటో అర్థం కావడంలేదట. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదంటే ప్రజలు జగన్ తీరుపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది. వైసీపీ ఓటమికి జగన్ పాలనాతీరు ఒక కారణమైతే.. మరోకటి జగన్ ప్రవర్తన అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా ఐదేళ్ల పాలనలో ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారనేది ఒక ఎత్తైతే.. ప్రభుత్వ ప్రవర్తన ఏ విధంగా ఉందనేది మరో ఎత్తు. వైసీసీ అధినేత జగన్‌తో పాటు ఆయన మంత్రివర్గంలోని సహచరుల ప్రవర్తన ప్రజలకు నచ్చకపోవడంతోనే ఈ విధమైన తీర్పు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

Chandrababu: చంద్రబాబు ఇంటి వద్ద సందడి వాతావరణం


అహంకారమే కొంపముంచిందా..

ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ.. అహంకారాన్ని ఉపేక్షించబోరనడానికి తెలంగాణ, ఏపీ ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమకు తిరుగులేదు అన్ని స్థానాల్లో విజయం మాదే.. అభ్యర్థికంటే తనను చూసే ఓటేస్తారని తెలంగాణలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భావించారు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధి, సంక్షేమం పక్కనపెడితే అహంకారాన్ని సహించబోమని తీర్పునిచ్చారు. ప్రతిపక్షాలను పట్టించుకోకుండా.. ప్రజలను చిన్నచూపు చేసే నాయకులు మాకొద్దని తిరస్కరించారు. వ్యవస్థలను తప్పుదోవపట్టించి.. రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటే సహించేది లేదంటూ కేసీఆర్‌ను గద్దె దించారు.
AP Election Result 2024: ఇంటిపేరు మార్చుకుంటున్నా: ముద్రగడ సంచలన ప్రకటన


ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రఅభివృద్ధిని పక్కనపెట్టి.. రాజకీయ కక్ష తీర్పుకోవడానికి వ్యవస్థలను ఉపయోగించుకున్నారనేది బహిరంగ రహస్యం. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి వేధింపులకు గురిచేయడం ప్రజలకు నచ్చలేదు. ప్రజాపాలన అందిచమని అధికారం ఇస్తే ప్రజలను, రాష్ట్ర అభివృద్ధి గాలికొదిలేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడాన్ని ప్రజలు తిరస్కరించారనేది ఎన్నికల ఫలితం స్పష్టం చేస్తోంది.

AP Election Result 2024: కలిసొచ్చిన ‘ఫ్యామిలీ’!


నాయకుడు అహంకారంతో విర్రవీగితే ఏమౌతుందో ప్రజలు రుచి చూపించారు. ఐదేళ్లు సీఎంగా జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అహంకార ధోరణిని ప్రదర్శించడమే ప్రస్తుతం ఆయన ఓటమికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. వైసీపీ నాయకుల ప్రవర్తనే వారిని ఓడించిందనే చర్చ జరుగుతోంది. వైసీపీలో గ్రామ స్థాయి నాయకుడు మొదలు రాష్ట్రస్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మానేసి... ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడాన్ని రాష్ట్రప్రజలు అంగీకరించలేదనేది ఈ ఫలితాలకు తర్కాణం. తాను పదుల సంఖ్యలో నొక్కిన బటన్లు ఓట్లు తెచ్చిపెట్టలేదని ఫలితాల తర్వాత జగన్ బాధపడటం కన్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు పోకుండా అభివృద్ధిపై దృష్టిపెడితే ఇలాంటి ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చేది కాదనే చర్చ రాష్ట్రంలో నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అహంకారంతో వ్యవహరించే నాయకులకు ఏపీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Prathipati Pullarao: వైసీపీ ఓటమికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ రెడ్డే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh and Latest Telugu News

Updated Date - Jun 05 , 2024 | 11:21 AM