Share News

AP Elections: ఏపీలో ప్రధాని పర్యటనపై కూటమి నేతల చర్చలు

ABN , Publish Date - May 02 , 2024 | 03:10 PM

Andhrapradesh: ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై కూటమి నేతలు భేటీ అయ్యారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన కూటమి నేతలు... రాష్ట్రంలో ప్రధాని పర్యటన నిర్వహణపై మూడు పార్టీల నేతలు చర్చలు నిర్వహించారు. ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, విజయవాడ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాని పర్యటన సాగనుంది.

AP Elections: ఏపీలో ప్రధాని పర్యటనపై కూటమి నేతల చర్చలు
Alliance Leaders Meeting

అమరావతి, మే 2: ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటనపై కూటమి నేతలు (Alliance Leaders) భేటీ అయ్యారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన కూటమి నేతలు... రాష్ట్రంలో ప్రధాని పర్యటన నిర్వహణపై మూడు పార్టీల నేతలు చర్చలు నిర్వహించారు. ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, విజయవాడ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాని పర్యటన సాగనుంది. ఈ సమావేశంలో సిద్దార్థ్ నాథ్ సింగ్, సుజనా చౌదరి (Sujana Chowdary), కేశినేని చిన్ని (Kesineni Chinni), గద్దె రామ్మోహన్ (Gadde Rammohan), అమ్మిశెట్టి వాసు, పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

AP Elections: అందరిలా మాటలు చెప్పడం చేతకాదు.. పనిచేసి చూపిస్తా: సుజనా


విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ ప్రధాని రోడ్ షో ఉంటుందన్నారు. రెండున్నర కిలోమీటర్ల మేర సాగే ఈ రోడ్ షోలో 2లక్షల మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రోడ్ షోలో పాల్గొంటారన్నారు. రెండున్నర కిలోమీటర్ల రోడ్ షో దాదాపు 2 గంటలకుపైగా సాగే అవకాశం ఉందని చెప్పారు.


విజయవాడ తూర్పు తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతోనే విజయవాడలో రోడ్ షో పెట్టినట్లు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలూ ఏకమవుతున్నారన్నారు.

Loksabha Polls: రిజర్వేషన్‌ తొలగించే యత్నం, మోదీపై రాహుల్ ఫైర్


విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ.. డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జగన్ అరాచక, విధ్వంస పాలనకు స్వస్తి పలకాలనే కసితో ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో 5 చోట్ల ప్రధాని పర్యటన జరిగేలా చూస్తున్నామని చెప్పారు. విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, తిరుపతి, రాజంపేటల్లో ప్రధాని పర్యటనను అధిష్టానానికి ప్రతిపాదించామని.. 5చోట్లా ప్రధాని పర్యటన జరిగేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. మూడు ప్రాంతాల్లో మోదీ కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

YS Sharmila: రాముడికి లక్ష్మణుడిలా వైఎస్ఆర్‌కు వివేకా: వైఎస్ షర్మిల

Viral Video: రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ఉన్నట్టుండి వాహనం అడుగున చూడగా.. ఎవరూ ఊహించని విధంగా..

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 03:49 PM