Share News

Viral Video: రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ఉన్నట్టుండి వాహనం అడుగున చూడగా.. ఎవరూ ఊహించని విధంగా..

ABN , Publish Date - May 02 , 2024 | 03:02 PM

పాడుబడ్డ వాహనాలు, పార్క్ చేసి ఉన్న వాహనాల్లో కొన్నిసార్లు ఊహించిన దృశ్యాలు కంటపడుతుంటాయి. కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా కొండచిలువలు, పాములు తదితర జీవులు బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...

Viral Video: రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ఉన్నట్టుండి వాహనం అడుగున చూడగా.. ఎవరూ ఊహించని విధంగా..

పాడుబడ్డ వాహనాలు, పార్క్ చేసి ఉన్న వాహనాల్లో కొన్నిసార్లు ఊహించిన దృశ్యాలు కంటపడుతుంటాయి. కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా కొండచిలువలు, పాములు తదితర జీవులు బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో షాకింగ్ సీన్ కనిపించింది. కారు కింద చూడగా ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యూఎస్‌లోని అలబామా హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో (car) వెళ్తున్న ఓ వ్యక్తికి.. తన పక్కగా వెళ్తున్న మరో కారు కింద షాకింగ్ దృశ్యం కనిపించింది. కారు కింద ఓ పెద్ద కొండచిలువ (python) తల బయటికి పెట్టి.. తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. కారు వేగంగా వెళ్తుండడంతో బయటికి వెళ్లిపోవడం సాధ్యం కాలేదు. దీంతో రోడ్డుపై అటూ, ఇటూ చూస్తూ.. ‘‘అనవసరంగా ఇరుక్కున్నానే.. ఇప్పుడెలా తప్పించుకోవాలబ్బా’’.. అని ఆలోచిస్తున్నట్లుగా ఉంది.

Viral Video: వామ్మో..! నీళ్లలోని మొసలికి ఇంత పవరా.. డ్రోన్ కెమెరా పంపడంతో చివరకు ఏం జరిగిందంటే..


ఈ ఘటనను మొత్తం ఇంకో కారులో వెళ్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ కొండచిలువ కారులోకి ఎలా వెళ్లింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సీన్ ఎక్కడా చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి పాత కూలర్‌ని ఏసీగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 02 , 2024 | 03:02 PM