Share News

Viral Video: దుస్తుల దుకాణంలోకి దూరిన ఎద్దులు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - May 01 , 2024 | 07:11 PM

జనసంచారంలోకి ప్రవేశించే జంతువులు చివరకు బీభత్సం సృష్టించే ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏనుగులు జనాన్ని పరుగులు పెట్టిస్తే.. మరికొన్నిసార్లు దున్నపోతులు మనుషులపై దాడులు చేసే ఘటనలు కూడా చూస్తుంటాం. ఇలాంటి...

Viral Video: దుస్తుల దుకాణంలోకి దూరిన ఎద్దులు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

జనసంచారంలోకి ప్రవేశించే జంతువులు చివరకు బీభత్సం సృష్టించే ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏనుగులు జనాన్ని పరుగులు పెట్టిస్తే.. మరికొన్నిసార్లు దున్నపోతులు మనుషులపై దాడులు చేసే ఘటనలు కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ చివరకు ఓ దుస్తుల దుకాణంలోకి దూరాయి. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు ఎద్దులు (bulls) పోట్లాడుకుంటూ ఉన్నట్టుండి ఓ దుస్తుల దుకాణంలోకి (clothing store) దూరాయి. సడన్‌గా లోపలికి వచ్చిన ఎద్దులను చూసి షాపులో ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. ఓ ఎద్దు మరో ఎద్దుపై దాడి చేయడంతో ఆవతలి ఎద్దు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ షాపులోని దుస్తులపై పడింది. కాళ్లతో గోడపై ఉన్న అరలపై కాలు మోపడంతో చీరలన్నీ కుప్పలుగా కిందపడిపోయాయి.

Puzzle: ఈ రెండు చిత్రాల్లో దాగున్న 3 తేడాలను.. 30 సెకన్లలో కనుక్కోగలరేమో ప్రయత్నించండి..


షాపులోని దుస్తులన్నీ నేలపై చిందరవందరగా పడిపోయాయి. బయటి నుంచి భయం భయం చూస్తున్న వారు.. లోపలికి వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయారు. ఆ ఎద్దులు అలా చాలా సేపు షాపులో బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వీటికి పోట్లాడుకోవడానికి ఇదే స్థలం దొరికిందా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి పాత కూలర్‌ని ఏసీగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 01 , 2024 | 07:11 PM