Share News

Viral Video: వారి మానాన వారుంటే అనవసరంగా గెలికారు.. చివరకు వరుడి ప్రవర్తన చూసి బిత్తరపోయిన వధువు..

ABN , Publish Date - Apr 30 , 2024 | 08:04 PM

వివాహాల్లో రకరకాల ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు సరదాగా మొదలైన ఘటనలు కాస్తా.. చివరకు సీరియస్‌గా మారుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఇవి పెద్ద గొడవలకు దారి తేసే ప్రమాదం ఉంటుంది. ఈ తరహా...

Viral Video: వారి మానాన వారుంటే అనవసరంగా గెలికారు.. చివరకు వరుడి ప్రవర్తన చూసి బిత్తరపోయిన వధువు..

వివాహాల్లో రకరకాల ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు సరదాగా మొదలైన ఘటనలు కాస్తా.. చివరకు సీరియస్‌గా మారుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఇవి పెద్ద గొడవలకు దారి తేసే ప్రమాదం ఉంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వధూవరులు.. వారి మానాన వారు ఉండగా.. బంధువులు అనవసరంగా కెలికారు. చివరకు వరుడి ఆగ్రహం చూసి వధువు షాక్ అయింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులను (bride and groom) ఊరేగింపునకు సిద్ధం చేస్తారు. పూలదండలు మార్చకున్న వధూవరులు ఊరేగింపు వాహనంపై నిలబడి ఉంటారు. ఈ క్రమంలో వాహనం కింద ఉన్న వారు అత్యత్సాహం ప్రదర్శిస్తారు. ఓ యువకుడు.. కాగితాలు వెదజల్లే బాణసంచాను చేతిలో పట్టుకుని, పొరపాటున వరుడి ఎదురుగా ఉంచి పేలుస్తాడు. దీంతో కాగితాలన్నీ వరుడి మీద పడడం ఉలిక్కిపడతాడు.

Viral Video: విషపూరిత పామును వెనిగర్‌లో ముంచాడు.. చివరకు గ్లాసులో జ్యూస్ తీసి..


ఆ తర్వాత మరో పటాకు కూడా పేలి అతడి భుజం వద్ద తాకుతుంది. దీంతో వరుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘ఏహే.. ఏంట్రా మీ ఉత్సాహం.. చంపుతారా ఏంటీ’’... అని అనుకుంటూ కాలితో వాహనం కింద ఉన్న వ్యక్తిని తన్నుతాడు. దీంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి కలుగజేసుకుని పటాకులు (firecrackers) పేల్చిన యువకుడిని పక్కకు పంపిస్తాడు. ఇలావుండగా వరుడి ఆగ్రహం చూసి పక్కన ఉన్న వధువు షాక్ అవుతుంది.

Eye Challenge: ఇది నిజంగా మీ కంటికి పరీక్షే.. ఈ చిత్రంలో పిల్లి ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రై చేయండి..


మొదట వరుడిని చేయి పట్టుకుని వెనక్కు లాగినా.. తర్వాత అతడి కోపం చూసి సైలెంట్‌గా నిలబడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీరి ఉత్సాహం తగలెయ్య.. వధూవరుల ప్రాణం మీదకు తెచ్చారు కదరా’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లిళ్లలో ఇలాంటి ఆకతాయిలు ఎవరో ఒకరు ఉంటారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 67వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: 2050లో ఉన్నామా..! ఆశ్చర్యానికి గురి చేస్తున్న 19 సెకన్ల వీడియో.. స్మార్ట్‌ఫోన్ లోపల వేయగానే..

Updated Date - Apr 30 , 2024 | 08:43 PM