Share News

Viral Video: పడవలో వెళ్తున్న మత్య్సకారుడికి షాకింగ్ అనుభవం.. నీటిలో నుంచి పడవలోకి వచ్చిన వింత జీవి.. చివరకు..

ABN , Publish Date - Apr 30 , 2024 | 09:12 PM

భూమిపై మనకు తెలీకుండా అనేక వింతలు, విశేషాలతో పాటూ వినూత్న జీవులు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చే కొన్ని జీవులు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: పడవలో వెళ్తున్న మత్య్సకారుడికి షాకింగ్ అనుభవం.. నీటిలో నుంచి పడవలోకి వచ్చిన వింత జీవి.. చివరకు..

భూమిపై మనకు తెలీకుండా అనేక వింతలు, విశేషాలతో పాటూ వినూత్న జీవులు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చే కొన్ని జీవులు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి వింత వింత జీవులకు సంబంధించిన అనేక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పడవలో వెళ్తున్న మత్స్యకారుడికి వింత అనుభవం ఎదురైంది. నీటిలో నుంచి పడవలోకి వచ్చిన వింత జీవిని చూసి షాక్ అయ్యాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మత్య్సకారుడు పడవలో వెళ్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఒడ్డుకు వెళ్తున్న పడవ సమీపానికి నీటిలో ఈదుతున్న ఓ జీవి వస్తుంది. పడవ సమీపానికి వచ్చిన అది ఉన్నట్టుండి పడవను పట్టుకుని లోపలికి వస్తుంది. తీరా చూస్తే అది స్పైడర్ కోతి (Spider monkey) అని తెలిసింది. బోటుపై కూర్చున్న కోతి.. తర్వాత ముందు వైపునకు వెళ్లి కూర్చుకుంటుంది.

Viral Video: కొండచిలువను చుట్టిముట్టిన ముంగిసల మంద.. భీకర పోరులో చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


వారు ఆ కోతిని ఒడ్డుకు చేర్చాలనే ఉద్దేశంతో సమీపంలోని అడవి ఒడ్డుకు తీసుకెళ్తారు. దీంతో చివరకు అది పడవ నుంచి దూకి సమీపంలోని అడవిలోకి వెళ్లిపోతుంది. దక్షిణ అమెరికాతో (South America) పాటూ క్షిణ మెక్సికో నుండి బ్రెజిల్ (Mexico to Brazil) వరకు ఉన్న అడవుల్లో ఈ స్పైడర్ కోతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కోతుల అవయవాలతో పాటూ తోక పొడవుగా ఉండడం వల్ల విచిత్రంగా కనిపిస్తుంటాయి.

Viral Video: ఇష్టం లేకున్నా బలవంతం చేశాడు.. చివరకు వధువు రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు..


పండ్లను తిని జీవించే ఈ కోతులు.. అప్పుడప్పుడూ ఆకులు, పూలు, కీటకాలను కూడా తింటుంటాయి. తేమతో కూడిన అడవుల్లో ఇవి ఎక్కువగా నివసిస్తుంటాయి. వీటిలో చాలా రకాల జాతులు ప్రస్తుతం అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం పడవలోకి ఎక్కిన స్పైడర్ కోతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వారి మానాన వారుంటే అనవసరంగా గెలికారు.. చివరకు వరుడి ప్రవర్తన చూసి బిత్తరపోయిన వధువు..

Updated Date - Apr 30 , 2024 | 09:12 PM