Share News

Viral Video: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా.. యజమానికి శ్రమ లేకుండా.. ఫ్రీగా..

ABN , Publish Date - May 01 , 2024 | 04:12 PM

కుక్కలు విశ్వాసం చూపించడంలోనే కాకుండా తెలివితేటలు ప్రదర్శించడంలోనూ మిగతా జంతువుల కంటే ముందుంటాయి. పెంపుడు కుక్కలు కొన్ని తమ యజమానులను కాపాడడం కోసం వివిధ రకాల సాహసాలు చేయడం చూస్తూ ఉంటాం. అలాగే..

Viral Video: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా.. యజమానికి శ్రమ లేకుండా.. ఫ్రీగా..

కుక్కలు విశ్వాసం చూపించడంలోనే కాకుండా తెలివితేటలు ప్రదర్శించడంలోనూ మిగతా జంతువుల కంటే ముందుంటాయి. పెంపుడు కుక్కలు కొన్ని తమ యజమానులను కాపాడడం కోసం వివిధ రకాల సాహసాలు చేయడం చూస్తూ ఉంటాం. అలాగే మరికొన్ని కుక్కలు చిత్ర విచిత్రగా ప్రవర్తి్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క తన యజామానికి శ్రమ లేకుండా తనకు తానుగా చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కారును వాషింగ్ కోసం ఇస్తాడు. దీంతో సదరు సిబ్బంది వాహనాన్ని ఆటోమేటిక్ వాషింగ్ (Automatic car washing) గదిలోకి పంపిస్తారు. ఇలా పంపగానే యథావిధిగా బ్రష్ లాంటి యంత్రం.. అటూ ఇటూ తిరుగుతూ కారును శుభ్రం చేస్తూ ఉంటుంది. దాన్ని చూడగానే కుక్కకు (dog) ఓ ఐడియా వస్తుంది. ‘‘స్నానం చేయించేందుకు యజమానికి మళ్లీ పని పెట్టకుండా.. ఇక్కడే స్నానం చేస్తే.. ఓ పనైపోతుంది’’.. అని అనుకుందో ఏమో గానీ అటూ, ఇటూ తిరుగుతున్న బ్రష్ వద్ద నిలబడుతుంది.

Viral Video: వారి మానాన వారుంటే అనవసరంగా గెలికారు.. చివరకు వరుడి ప్రవర్తన చూసి బిత్తరపోయిన వధువు..


బ్రష్ యంత్రం వద్ద నిలబడడంతో కుక్కపై ఉన్న దుమ్ము మొత్తం పోయి శుభ్రంగా మారుతుంది. ఇలా ఫ్రీగా స్నానం చేసి రీఫ్రెష్ అవుతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఉచిత స్నానం చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కొండచిలువను చుట్టిముట్టిన ముంగిసల మంద.. భీకర పోరులో చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..

Updated Date - May 01 , 2024 | 04:13 PM