Share News

AP Elections: అందరిలా మాటలు చెప్పడం చేతకాదు.. పనిచేసి చూపిస్తా: సుజనా

ABN , Publish Date - May 02 , 2024 | 02:13 PM

Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం ముస్లీం సంఘాలతో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి సమావేశమయ్యారు. భవిష్యత్‌లో ముస్లీం సమాజం కోసం చేపట్టబోయే కార్యాచరణను ఈ సందర్భంగా సుజనా వివరించారు. ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని వారికి బీజేపీ అభ్యర్థి భరోసా ఇచ్చారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ..

AP Elections: అందరిలా మాటలు చెప్పడం చేతకాదు.. పనిచేసి చూపిస్తా: సుజనా

విజయవాడ, మే 2: పశ్చిమ నియోజకవర్గం ముస్లీం సంఘాలతో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి (BJP candidate Sujana Chowdary) సమావేశమయ్యారు. భవిష్యత్‌లో ముస్లీం సమాజం కోసం చేపట్టబోయే కార్యాచరణను ఈ సందర్భంగా సుజనా వివరించారు. ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని వారికి బీజేపీ అభ్యర్థి (BJP candidate) భరోసా ఇచ్చారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని.. కానీ మోదీ (PM Modi) వచ్చిన తర్వాత దేశంలో ముస్లీంలకు ఒక భరోసా ఇచ్చారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ముస్లీం, క్రిస్టియన్, ఎండోమెండ్ ఆస్తులను కాపాడుకుందామన్నారు.

Loksabha Polls: రిజర్వేషన్‌ తొలగించే యత్నం, మోదీపై రాహుల్ ఫైర్


‘‘ఈ ఎన్నికలలో నన్ను కమలం గుర్తుపై , కేశినేని శివనా‌థ్‌ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఆ తర్వాత అభివృద్ది, సంక్షేమం ఎలా ఉంటుందో మీరే చూడండి. నేను మాట తప్పి పని చేయకుంటే ఎవైరనా ప్రశ్నించవచ్చు’’ అని తెలిపారు. మోదీ దేశంలో, చంద్రబాబు రాష్ట్రంలో, సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది ఎలా ఉంటుందో చూపుతారన్నారు. గతంలో అబద్దాలు, అత్యాలను నమ్మారని.. ఈ ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రతి డివిజన్‌లో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్


మైనారిటీ మహిళలు సొంతంగా ఎదిగేలా రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతిభ ఉన్న మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తామన్నారు. అందరిలా మాటలు చెప్పడం చేతకాదని.. గెలిపించి చూడాలని.. పని చేసి చూపిస్తామని తెలిపారు. కులం, మతం కాదు... అభివృద్ది, సంక్షేమం చేసే వారు ఎవరు అనేది ఆలోచనచేయాలన్నారు. ముస్లీంలు ఓటు బ్యాంకు కోసం చూసే వ్యక్తిని కాదని.. ఆర్ధికంగా ఎదిగి ఆదర్శంగా నిలిచేలా ముస్లీం సమాజానికి అండగా ఉంటామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

YS Sharmila: రాముడికి లక్ష్మణుడిలా వైఎస్ఆర్‌కు వివేకా: వైఎస్ షర్మిల

Lok Sabha Polls 2024: రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే మంచిది: సీపీఐ నారాయణ

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 02:52 PM