Share News

Chandrababu: ఏపీ ఎన్నికల ప్రకటనపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 05:18 PM

కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఎన్నికల తేదీలను ప్రకటించడంపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం తేదీల షెడ్యూల్ కూడా ఇచ్చిందని... వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా అడ్టుకోవాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి...‌ రాష్ట్రం నిలబడాలి అనే స్లోగన్‌తో ముందుకు సాగుతామని తెలిపారు.

Chandrababu: ఏపీ ఎన్నికల ప్రకటనపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఎన్నికల తేదీలను ప్రకటించడంపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం తేదీల షెడ్యూల్ కూడా ఇచ్చిందని... వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా అడ్టుకోవాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి...‌ రాష్ట్రం నిలబడాలి అనే స్లోగన్‌తో ముందుకు సాగుతామని తెలిపారు. ఇంకా 57 రోజులు పోలింగ్‌కు సమయం ఉందన్నారు. చరిత్ర తిరగ రాయబోతున్నామని సైకోను ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సైకో దురాగతాలను ప్రజలకు చెప్పాలని అన్నారు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలని.. దుర్మార్గపు ‌పాలనను తరిమి కొట్టాలని అన్నారు. ఏపీలో, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సైకో పాలనను , సైకోని ఓడించడం ఖాయమన్నారు. కౌంట్ డౌన్ ఇక ప్రారంభం అయ్యిందని ఉన్మాదులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం నాడు జనరల్ ఎలక్షన్ సమ్మిట్ జరిగింది. ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... చరిత్రలో నిలిచి పోయేలా దేశంలో ఎన్డీఏ 400కు పైగా సీట్లను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో కూడా రికార్డు స్థానాల్లో గెలుస్తామని ఏపీని అభివృద్ధి చేస్తామని అన్నారు. అన్ని వనరులను ఉపయోగించుకుని అభివృద్ధిలో ఆంధ్రాను అగ్రగామిగా మలుస్తామని వివరించారు. రాష్ట్రం హితం కోరి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుతో వెళ్తున్నాయని అన్నారు. నేడు లీగల్ సమావేశాలు పెట్టుకుని పోరాటం చేసే పరిస్థితి ఉందన్నారు. తన పైనే ఎన్ని కేసులు పెట్టారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. అసలు ఎప్పుడు ఎక్కడ కేసు నమోదు అయ్యిందో తెలియదని చెప్పారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని అడిగి తనపై నమోదైన కేసులు తెలుసు కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ వల్లే నేటికీ న్యాయం బతుకుతుందని అన్నారు. పాలన, రాజకీయ, మీడియా వ్యవస్థలను న్యాయ వ్యవస్థ గాడిలో పెడుతుందని చెప్పారు. తనను అక్రమంగా అరెస్టు చేయడంతో నిద్ర లేని రాత్రులు గడిపానని చెప్పారు. న్యాయ వాదులపై కూడా అన్యాయంగా కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుకు వెళ్లి పరిస్థితిని వివరించి కేసులు కొట్టించుకునేలా చేశారని చంద్రబాబు అన్నారు.

ఆ నేతను కంటికి రెప్పలా కాపాడుకున్నాం

‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని దారుణాలు చేశారో చూశాం. అభ్యర్థులను భయపెట్టి విత్ డ్రా చేయించారు. గెలిచిన వారిని కూడా ఓడినట్లు అధికారులతో ప్రకటించారు. ఈ చేతకాని సీఎం జగన్‌రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ ఉన్మాది నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి న్యాయవాదులు కూడా సంఘటితం‌ కావాలి. మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ప్రజలకు వాస్తవాలు వివరించి రాష్ట్రానికి మేలు చేయడంలో భాగస్వామ్యం కావాలి. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు జగన్ అమలు చేయలేదు. మేము అధికారంలోకి వస్తే ‘న్యాయమిత్త’ పేరుతో ఏడు వేల రూపాయలు ఇస్తాం. జగన్ రూ. వంద కోట్లు ఇస్తా అని, రూ. ఇరవై కొట్లు ఇచ్చారు. మేము రూ. వంద కోట్లు న్యాయవాదులకు ఇచ్చి తీరుతాం. మెడికల్ కోసం రూ. ఐదు లక్షలు, యాక్సిడెంట్ పాలసీ రూ. పది లక్షల ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. అర్హులైన న్యాయ వాదులకు తప్పకుండా ఇంటి స్థలం‌ ఇస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని దుర్మార్గపు చట్టం జగన్ తెచ్చాడు. దుర్మార్గుడు చేతిలో పాలన ఉంటే ఎంత దారుణమో... ఏపీపీఎస్సీ తీరు నిదర్శనం. రెండు సార్లు వ్యాల్యూషన్ చేసినా కోర్టు కొట్టేసిందంటే జగన్ చేతకాని‌పాలనను అర్ధం చేసుకోండి. నాతో కలిసి పోరాటం చేసే వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుని వదలకుండా జగన్ ఇబ్బందులు పెట్టారు. అతని కోసం జాగారం చేసి కాపాడాం...‌లేకుంటే చంపేసేవారు. మన రాష్ట్రాన్ని‌ కాపాడటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలి. మీలాంటి వాళ్లు చెప్పే మాటలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. మేధావులు అందరూ ఐక్యంగా బయటకి రండి.. రాష్ట్రం కోసం పని చేయండి. మన దేశం, మన రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉండాలి. ప్రపంచానికి మన దేశం ఆదర్శం, దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలంటే ఈ మూడు పార్టీలతోనే సాధ్యం. ప్రతిరోజూ ప్రచారం కోసం కొంత సమయం కేటాయించి మార్పులో భాగస్వామ్యం కావాలి. టైటిల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను మేము తప్పకుండా రద్దు చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..

AP Bhavan: ఎట్టకేలకు వీడిన ఏపీ భవన్ విభజన పీటముడి

AP NEWS: గ్రూపు-1ప్రిలిమ్స్ పరీక్షపై సీఎస్ జవహర్‌రెడ్డి కీలక సూచనలు

Purandeswari: రాబోయే ఎన్నికల్లో దొంగ‌ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర పన్నినా వైసీపీ

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 05:18 PM