Share News

AP NEWS: గ్రూపు-1ప్రిలిమ్స్ పరీక్షపై సీఎస్ జవహర్‌రెడ్డి కీలక సూచనలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:14 PM

ఏపీపీఎస్సీ గ్రూపు-1స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష రేపు (ఆదివారం) జరగనున్నదని సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) అన్నారు. పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు.

AP NEWS:  గ్రూపు-1ప్రిలిమ్స్ పరీక్షపై సీఎస్ జవహర్‌రెడ్డి కీలక సూచనలు

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూపు-1స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష రేపు (ఆదివారం) జరగనున్నదని సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) అన్నారు. పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. మొత్తం లక్షా 48 వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పేపర్-2 పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. గ్రూపు-1 పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులతో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులను సీఎస్ ఆదేశించారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు ఇతర సామాగ్రి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ జవహర్‌రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..

AP Bhavan: ఎట్టకేలకు వీడిన ఏపీ భవన్ విభజన పీటముడి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 04:14 PM