Share News

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..

ABN , Publish Date - Mar 16 , 2024 | 03:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4 న కౌంటింగ్ జరగనుంది. 2024 మార్చి 16న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రెస్ నోట్, ప్రకటన రిలీజ్ అయింది. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్ న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది. అసెంబ్లీ ( Assembly ) ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సైతం తేదీలు ఖరారయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్ ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది

కాగా.. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగాయి. వైసీపీ ఘన విజయం సాధించగా టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దీంతో మరోసారి ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారం చేపట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుండగా.. టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఫలితంగా ఈ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వాడీ వేడీగా సాగనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 04:03 PM