Share News

Purandeswari: రాబోయే ఎన్నికల్లో దొంగ‌ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర పన్నినా వైసీపీ

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:35 PM

రాబోయే ఎన్నికల్లో దొంగ‌ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని బీజేపీ (BJP) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ప్రతి ఒక్కరూ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఇతర పార్టీలో సమర్ధవంతంగా పనిచేసిన వారు తమ పార్టీకి ఆకర్షితులై చేరుతున్నారని అన్నారు.

Purandeswari: రాబోయే ఎన్నికల్లో దొంగ‌ ఓట్లు వేయించుకోవడానికి  కుట్ర పన్నినా వైసీపీ

విజయవాడ: రాబోయే ఎన్నికల్లో దొంగ‌ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని బీజేపీ (BJP) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ప్రతి ఒక్కరూ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఇతర పార్టీలో సమర్ధవంతంగా పనిచేసిన వారు తమ పార్టీకి ఆకర్షితులై చేరుతున్నారని అన్నారు. ఏపీలో వైసీపీ పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందన్నారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి సీఎం జగన్‌రెడ్డి పాలిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇక ఎన్నికలకు అడుగుపెట్టినట్లేనని చెప్పారు. జగన్ దుష్టపాలనకు చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపై ఉందని చెప్పారు.

దొంగ‌ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ సమయాత్తం అవుతుందన్నారు. వై నాట్ 175 అంటే దొంగ ఓట్లతో గెలుద్దామనే జగన్ ధీమాగా ఉన్నారని చెప్పారు. డీఎస్సీ పరీక్షలో పది లక్షల మంది ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలనే ఎన్నికల సమయంలో పరీక్షలు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ‌ సంఖ్య పెంచింది జగనే అని ధ్వజమెత్తారు. దుష్ట ఆలోచన కలిగిన ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. రోడ్లన్నీ గతుకుల మయం అయ్యాయని చెప్పారు. రోడ్లు అధ్వాన్నంగా‌ ఉన్నాయన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తును ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. తమ అభ్యర్థులకు సంబంధించి అధిష్ఠానం త్వరలోనే ప్రకటిస్తుందని వివరించారు. రేపు(ఆదివారం) ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారని పురందేశ్వరి తెలిపారు.

ఇవి కూడా చదవండి

AP NEWS: గ్రూపు-1ప్రిలిమ్స్ పరీక్షపై సీఎస్ జవహర్‌రెడ్డి కీలక సూచనలు

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..

AP Bhavan: ఎట్టకేలకు వీడిన ఏపీ భవన్ విభజన పీటముడి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 04:36 PM