Share News

World cup: రోహిత్, కోహ్లీ నాకు ఇష్టమైన క్రికెటర్లు: బాబర్ అజామ్

ABN , First Publish Date - 2023-10-29T16:05:36+05:30 IST

ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తన ఫెవరేట్ ఆటగాళ్లుగా చెప్పాడు.

World cup: రోహిత్, కోహ్లీ నాకు ఇష్టమైన క్రికెటర్లు: బాబర్ అజామ్

ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తన ఫెవరేట్ ఆటగాళ్లుగా చెప్పాడు. రోహిత్, కోహ్లీతోపాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా తన ఫెవరేట్ క్రికెటర్ అని బాబర్ పేర్కొన్నాడు. వీరి ముగ్గురినే తన ఫెవరేట్ క్రికెటర్లుగా ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా బాబర్ తెలిపాడు. వారు ముగ్గురు జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేసే సామర్థ్యాన్ని కల్గి ఉన్నారని కొనియాడు. అందుకే వారిని తాను ఎక్కువగా ఇష్టపడుతుంటానని బాబర్ తెలిపాడు. ప్రస్తుత క్రికెటర్లలో తనకు ఇష్టమైన ఆటగాళ్లు ఎవరనే ప్రశ్నకు సమాధానంగా బాబర్ ఈ మేరకు సమాధానం ఇచ్చాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ప్రస్తుత తరంలో తన ఫెవరేట్ క్రికెటర్లు ఎవరో చెప్పమని బాబర్ అజామ్‌కు ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా బాబర్ ‘‘"విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్ ప్రపంచంలోనే నాకు ఇష్టమైన బ్యాటర్లు. వారు ప్రపంచంలోనే టాప్ ప్లేయర్లు. వారు పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. అందుకే వారు అత్యుత్తమంగా ఉన్నారు. నేను వారిని అభినందిస్తున్నాను. విరాట్, రోహిత్, కేన్‌లలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే.. వారు జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తారు. కఠినమైన బౌలింగ్‌కు వ్యతిరేకంగా పరుగులు సాధిస్తారు. ఇది నేను వారి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని అతను చెప్పాడు.


ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కేన్ విలియమ్సన్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక బాబర్ అజామ్ విషయానికొస్తే భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతునప్పటికీ పర్వలేదనిపిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 3 సార్లు హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నపటికీ వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చలేకపోయాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానంలో, న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతున్న పాకిస్థాన్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఆ జట్టు సెమీ ఫైనల్ అవకాశాలు కూడా దాదాపుగా మూసుకుపోయాయి.

Updated Date - 2023-10-29T16:05:36+05:30 IST