Viral Video: ప్రమాదంలో ఉన్న పిల్లిని కాపాడిన కుందేలు.. దీని తాపత్రయం చూస్తే శభాష్ అనకుండా ఉండలేరు..

ABN , First Publish Date - 2023-05-13T21:12:45+05:30 IST

జంతువులకు ఉన్న విశ్వాసం, ప్రేమనురాగాల్లో కనీసం ఒక్కశాతం కూడా మనుషుల్లో కనపడడం లేదు. చాలా మంది తోటి మనుషుల పట్ల రాక్షసంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఎదుటి వారు ప్రమాదంలో ఉంటే సంతోషించే వారే తప్ప వారిని..

Viral Video: ప్రమాదంలో ఉన్న పిల్లిని కాపాడిన కుందేలు.. దీని తాపత్రయం చూస్తే శభాష్ అనకుండా ఉండలేరు..

జంతువులకు ఉన్న విశ్వాసం, ప్రేమనురాగాల్లో కనీసం ఒక్కశాతం కూడా మనుషుల్లో కనపడడం లేదు. చాలా మంది తోటి మనుషుల పట్ల రాక్షసంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఎదుటి వారు ప్రమాదంలో ఉంటే సంతోషించే వారే తప్ప వారిని కాపాడదామన్న స్ప్రుహ ఉండడం లేదు. కొందరైతే సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా దారుణంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో చాలా జంతువులు.. మనుషులకు గుణపాఠం నేర్పిస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ పిల్లి, కుందేలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రమాదంలో ఉన్న పిల్లిని కాపాడిన కుందేలును చూసి.. అంతా శభాష్ అని మెచ్చుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఓ పిల్లి ప్రమాదవశాత్తు ఓ రేకుల షెడ్డులో చిక్కుకుపోతుంది. దాని నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటుంది. అయినా బయటికి వచ్చే మార్గం లేక సతమతమవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమోగానీ ఓ కుందేలు (rabbit) అటుగా వెళ్తుంది. పిల్లి సమస్యను గుర్తించిన కుందేలు.. వెంటనే దాని కాపాడాలని అనుకుంటుంది. పిల్లిని (cat) క్షేమంగా బయటికి తెచ్చేందుకు ఎంతో తెలివిగా ఆలోచిస్తుంది. వెంటనే రేకుల వద్ద ఉన్న మట్టిని తొలగిస్తుంది. మట్టిని తొలగించే క్రమంలో పిల్లిని త్వరగా (saving life) కాపాడాలనే తపన కనపడుతుంది.

Viral Video: వచ్చిన కాసేపటి తర్వాత ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయాడు.. మధ్యలో ఇతడి తెలివితేటలు చూస్తే.. అవాక్కవుతారు..

వేగంగా మట్టిని తోడి బయటకు పడేస్తుంది. ఇలా క్రమంగా రేకుల కింద నుంచి పిల్లి బయటికి వచ్చేలా పెద్ద గుంతను తీస్తుంది. ‘‘మధ్య మధ్యలో మిత్రమా! నువ్వు క్షేమంగా ఉన్నావు కదా.. భయపడకు నేనున్నా’’.. అన్నట్లుగా పిల్లిని తాకుతూ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఇలా చాలా సేపు శ్రమించి.. ఎట్టకేలకు పిల్లి బయటికి వచ్చేంత గుంతను తీస్తుంది. చివరగా ఓ మార్గాన్ని సిద్ధం చేసి.. ‘‘నా కర్తవ్యాన్ని నేను పాటించా.. వెళ్లొస్తా మిత్రమా’’.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ఆవు నిజంగా గోమాతే.. పిల్లాడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-05-13T21:12:45+05:30 IST