Viral Video: ప్రియుడితో ఉన్న భార్య వద్దకు సడన్‌గా వెళ్లిన భర్త.. వీడియో తీస్తుండగా.. చిరాకుపడుతూ ఆమె చెప్పిన సమాధానం..

ABN , First Publish Date - 2023-05-13T19:54:04+05:30 IST

రానురాను భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతోంది. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే తప్పుల వల్ల.. చివరకు దాంపత్య జీవితం సమస్యల వలయంగా మారుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విడాకుల వరకూ వెళ్లడమో.. లేదా...

Viral Video: ప్రియుడితో ఉన్న భార్య వద్దకు సడన్‌గా వెళ్లిన భర్త.. వీడియో తీస్తుండగా.. చిరాకుపడుతూ ఆమె చెప్పిన సమాధానం..

రానురాను భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతోంది. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే తప్పుల వల్ల.. చివరకు దాంపత్య జీవితం సమస్యల వలయంగా మారుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విడాకుల వరకూ వెళ్లడమో.. లేదా జీవితాన్ని మధ్యలోనే ముగించడమో చేస్తుంటారు. వివాహేతర సంబంధాలు కొనసాగించే భార్యాభర్తలు.. కొన్నిసార్లు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన భార్యను.. ప్రియుడితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వీడియో తీస్తుండగా ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) వైరల్ అవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు (Quarrels between couples) తలెత్తడంతో చివరకు విడాకులు (Divorce) తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు ఓ లాయర్‌ని ఆశ్రయించారు. దంపతులకు విడాకులు ఇప్పించేందుకు లాయర్ సాయం చేస్తుండేవాడు. అయితే ఈ క్రమంలో సదరు మహిళతో (woman) లాయర్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. చివరకు వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న భర్త.. వారిని ఎలాగైనా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్య ప్రియుడితో ఉందన్న విషయం తెలుసుకున్న భర్త.. నేరుగా వారు ఉంటున్న బెడ్‌రూమ్‌కి వెళ్లాడు.

Crime News: బెడ్‌రూంలో పాటల సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో భార్యకు అనుమానం.. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. భర్త చేసిన నిర్వాకం..

లోపలికి వెళ్లగానే ఫోన్‌లో వీడియో ఆన్ చేశాడు. భర్త సడన్‌గా లోపలికి రావడంతో భార్య ఖంగుతింది. వెంటనే పైకి లేచి భర్త వైపు కోపంగా చూసింది. ‘‘ఎందుకు మోసం చేశావ్’’.. భర్త ప్రశ్నించడంతో మరింత చిరాకుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. తప్పు చేశాననే పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా ‘‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు.. వీడియో ఎందుకు తీస్తున్నావ్’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇలాంటి భార్య వల్లే సంసారాలు నాశనం అవుతున్నాయ్’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: వచ్చిన కాసేపటి తర్వాత ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయాడు.. మధ్యలో ఇతడి తెలివితేటలు చూస్తే.. అవాక్కవుతారు..

Updated Date - 2023-05-13T19:54:04+05:30 IST