Viral Video: చెమటలు పట్టించిన విమాన ప్రయాణం.. మధ్యలో టిష్యూతో పెద్ద ఇష్యూ!

ABN , First Publish Date - 2023-08-06T18:05:51+05:30 IST

విమాన ప్రయాణం ఎంత విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరకంగా.. దాన్నొక స్వర్గంలాంటి అనుభూతిగా వర్ణించుకోవచ్చు. మేఘాల మధ్యలో పక్షిలా విహరిస్తూ పొందే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఒక్కరూ...

Viral Video: చెమటలు పట్టించిన విమాన ప్రయాణం.. మధ్యలో టిష్యూతో పెద్ద ఇష్యూ!

విమాన ప్రయాణం ఎంత విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరకంగా.. దాన్నొక స్వర్గంలాంటి అనుభూతిగా వర్ణించుకోవచ్చు. మేఘాల మధ్యలో పక్షిలా విహరిస్తూ పొందే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇక డబ్బులున్న వారికైతే ఇది బస్సు ప్రయాణం లాంటిది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ విమాన ప్రయాణం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. సుమారు 90నిముషాలు వారు నరకయాతన అనుభవించారు. మధ్యలో ప్రయాణికులందరికీ.. ఎయిర్ హోస్టెస్ టిష్యూ పేపర్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

చండీగఢ్‌ నుంచి జైపూర్‌కు (Chandigarh to Jaipur) వెళ్లేందుకు ఇండిగో విమానం (Indigo flight) సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా హడావుడిగా వెళ్లి ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. కాసేపటికి విమానం రివ్వున ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆకాశంలోకి వెళ్లిన కొద్ది సేపటికే విమానం లోపల ఏసీ పని చేయలేదు. ముందు ఈ విషయం ఎవరికీ అర్థం కాకున్నా.. నిముషాలు గడిచే కొద్దీ అందరికీ చెమటలు పట్టడం ప్రారంభించాయి. ‘‘ఇదేంటీ! మనం విమానంలో ఉన్నామా.. లేక ఏదైనా గుహలో ఉన్నామా’’.. అని ఒకరినొకరు చర్చించుకోవడం మొదలెట్టారు. మరికొద్ది సేపటికి విపరీతమైన చెమటకు తట్టుకోలేక పుస్తకాలు, పేపర్లు.. ఇలా ఏది దొరికితే దాంతో విసురుకోవడం మొదలెట్టారు.

Viral Video: రైల్వే పట్టాలపై నడుస్తూ వెనక్కు తిరిగి చూడగా షాకింగ్ సీన్.. రైలుకు బదులుగా ఏమొచ్చిందంటే..

అంతలో ఎయిర్‌హోస్టెస్ అక్కడికి వచ్చి.. ‘‘అంతరాయానికి చింతిస్తున్నాం.. సాంకేతిక లోపం వల్ల ఏసీ పని చేయలేదు.. అంతవరకూ మీరు ఈ టిష్యూ పేపర్లతో సరిపెట్టుకోండి’’.. అంటూ అందరికీ వాటిని పంచిపెట్టింది. అప్పటికే చికాకుతో ఉన్న ప్రయాణికుల మొఖాలు.. టిష్యూ పేపర్లను చూడగానే మరింత ఎర్రబడ్డాయి. ఇలా సుమారు 90 నిముషాల పాటు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పంజాబ్‌ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా (Congress Punjab President Amarinder Singh) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ సమయంలో తాను కూడా విమానంలో ఉన్నానని, టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకూ ఎక్కడా ఏసీ పని చేయలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

AC: ఏసీ తెచ్చిన తంటా.. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రపోతోంటే అర్ధరాత్రి దాటిన తర్వాత సడన్‌గా..!

ఈ వీడియోను షేర్ చేసిన అమరీందర్ సింగ్.. సదరు విమానయాన సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ ‘‘ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’’కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఘటనపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. సమస్య తమ దృష్టికి వచ్చిందని, ఇందుకు తాము చింతిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం (Viral video) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఈ ఇల్లు కట్టిన కాంట్రాక్టర్‌‌కి నిజంగా దండం పెట్టొచ్చు.. ఇంటి గోడలను చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

Updated Date - 2023-08-06T18:10:15+05:30 IST