Viral Video: ఈ ఎద్దు ఎంత పవర్‌ఫుల్లో.. కారుపై అటాక్ చేసి అమాంతం పైకి లేపేస్తోంది.. లోపల ఉన్న వాళ్లు బయటకు రాలేక..!

ABN , First Publish Date - 2023-08-05T17:31:18+05:30 IST

‘‘పరుగు పరుగున వచ్చిన జోడెద్దులు.. ఓ జీపును ఢమేల్‌మని ఎత్తి కింద పడేస్తాయి. వాటిని చూడగానే విలన్ల గుండెల్లో వణుకు పుడుతుంది’’.. అఖండ సినిమాలోని ఈ సీన్ ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. దాదాపు ఇలాంటి సీన్ నిజ జీవితంలోనూ రిపీట్ అయింది...

Viral Video: ఈ ఎద్దు ఎంత పవర్‌ఫుల్లో.. కారుపై అటాక్ చేసి అమాంతం పైకి లేపేస్తోంది.. లోపల ఉన్న వాళ్లు బయటకు రాలేక..!

‘‘పరుగు పరుగున వచ్చిన జోడెద్దులు.. ఓ జీపును ఢమేల్‌మని ఎత్తి కింద పడేస్తాయి. వాటిని చూడగానే విలన్ల గుండెల్లో వణుకు పుడుతుంది’’.. అఖండ సినిమాలోని ఈ సీన్ ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. దాదాపు ఇలాంటి సీన్ నిజ జీవితంలోనూ రిపీట్ అయింది. ఓ బలమైన ఎద్దు కారు వద్దకు వచ్చి కొమ్ములతో అమాంతం పైకి లేపింది. దీంతో లోపల ఉన్న వారు భయంతో వణికిపోయారు. బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో! ఈ ఎద్దు అఖండ సినిమాలో ఎద్దులకు ఏమాత్రం తీసిపోదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోసల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో కొంత మంది కూర్చుని ఉంటారు. అయితే అదే సమయంలో ఓ ఎద్దు అక్కడికి వస్తుంది. వచ్చీ రాగానే తన కోపాన్నంతా కారుపై చూపిస్తుంది. కారు ముందు వైపు కొమ్ములతో (bull attacked a car) దాడి చేస్తుంది. అంతటితో ఆగకుండా అంత పెద్ద కారును ఒక్క ఉదుటున పైకి లేపేస్తుంది. ఇలా చాలా సార్లు పైకి, కిందకు ఎత్తి పడేస్తూ ఉంటుంది. దీంతో కారులో ఉన్న వారంతా భయాందోళనకు గురవుతారు. కాపాడండి.. కాపాడండి.. అంటూ గట్టిగా కేకలు పెట్టారు. అయితే చుట్టు పక్కల ఉన్న వారు సమీపానికి వెళ్లేందుకు కూడా సాహసించలేదు.

AC: ఏసీ తెచ్చిన తంటా.. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రపోతోంటే అర్ధరాత్రి దాటిన తర్వాత సడన్‌గా..!

ఎక్కడ తమ మీద కూడా దాడి చేస్తుందోనని భయంతో దూరంగా ఉండిపోయారు. కొందరు ఎద్దు పైకి కర్రలు విసిరి పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అయినా ఎద్దు మాత్రం తన కోపం తగ్గేదాకా కారును వదల్లేదు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఈ ఎద్దు చాలా పవర్‌ఫుల్ ఉన్నట్టుందే’’.. అని కొందరు, ‘‘సినిమాల్లోకి బాగా పనికొస్తుంది’’.. అని మరికొందరు, ‘‘అయ్యో పాపం కారులో ఉన్న వారి పరిస్థితి ఏంటో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman: ఆస్పత్రికి వచ్చిన 25 ఏళ్ల యువతి.. ఓ బాలింత గదిలోకి వెళ్లడంతో నర్సులకు డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

Updated Date - 2023-08-05T17:31:18+05:30 IST