Death Mystery: అమ్మలూ.. బీ అలెర్ట్.. వంటింట్లో వాడే కుక్కర్ ఈ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-08-04T19:49:11+05:30 IST

పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. కానీ కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా అకాల మరణం సంభవిస్తుంటుంది. కొన్నిసార్లు మనుషుల మరణానికి గల కారణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా..

Death Mystery: అమ్మలూ.. బీ అలెర్ట్.. వంటింట్లో వాడే కుక్కర్ ఈ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో తెలిస్తే..!

పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. కానీ కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా అకాల మరణం సంభవిస్తుంటుంది. కొన్నిసార్లు మనుషుల మరణానికి గల కారణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా, జైపూర్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. వంటింట్లో వంట చేస్తుండగా ఓ మహిళ కుక్కర్ కారణంగా చనిపోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

జైపూర్ (Jaipur) ఝత్వారా పరిధి భోమియా నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కిరణ్ కన్వర్ అనే మహిళకు (woman) భర్త, కొడుకు సూర్య ప్రతాప్ ఉన్నారు. భర్త కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఉన్నట్టుండి విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం కిరణ్ కన్వర్ భర్త ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లిపోయాడు. అలాగే కొడుకు సూర్య కూడా పుస్తకాలు కొనుక్కోవడానికి బయటికి వెళ్లాడు. ఆ సమయంలో కిరణ్ కన్వర్ ఒక్కతే ఇంట్లో వంట చేస్తోంది. రోజూ చేసే పనే అయినా ఆ రోజు మాత్రం ఆమె ప్రాణాల మీదకు వచ్చిపడింది.

Viral: భారత్‌కు రాబోతున్న మరో పాక్ యువతి.. రెండ్రోజుల క్రితమే ఆన్‌లై‌న్‌లో జరిగిన పెళ్లి.. సీమా ఘటన మరువకముందే..!

కిచెన్‌లో వంట వండే క్రమంలో ప్రమాదవశాత్తు కుక్కర్ ఒక్కసారిగా (exploded cooker) పేలిపోయింది. దాని విడిభాగాలు ఆమెను బలంగా ఢీకొట్టాయి. పేలుడు శబ్ధానికి చుట్టు పక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడినకిరణ్ కన్వర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రెషర్ కుక్కర్‌లో విజిల్ బ్లాక్ కావడంతో ఆవిరి బయటకు పోలేదు. దీంతో చివరకు పేలుడు సంభవించినట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Fridge-Milk: ఫ్రిడ్జ్‌లో పాలను ఎక్కడ ఉంచుతున్నారు..? తెలియక అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే..!

Updated Date - 2023-08-04T19:49:11+05:30 IST