Viral Video: రైల్వే పట్టాలపై నడుస్తూ వెనక్కు తిరిగి చూడగా షాకింగ్ సీన్.. రైలుకు బదులుగా ఏమొచ్చిందంటే..

ABN , First Publish Date - 2023-08-05T21:48:28+05:30 IST

రైల్వే పట్టాలపై కొందరు నిర్లక్ష్యంగా నడుస్తూ కొందరు, రీల్స్ చేస్తూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం రోజూ చూస్తూనే ఉంటాం. అయినా చాలా మంది పదే పదే ఇలాంటి పనులు చేస్తూ ప్రమాదానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు...

Viral Video: రైల్వే పట్టాలపై నడుస్తూ వెనక్కు తిరిగి చూడగా షాకింగ్ సీన్.. రైలుకు బదులుగా ఏమొచ్చిందంటే..

రైల్వే పట్టాలపై కొందరు నిర్లక్ష్యంగా నడుస్తూ కొందరు, రీల్స్ చేస్తూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం రోజూ చూస్తూనే ఉంటాం. అయినా చాలా మంది పదే పదే ఇలాంటి పనులు చేస్తూ ప్రమాదానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి రైల్వే పట్టాలపై నడుస్తూ ఉండగా అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

మహారాష్ట్రలోని (Maharashtra) లోనోవాలాలోని కొండ ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల మహారాష్ట్ర మొత్తం భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో స్థానికంగా ఉన్న కొండ ప్రాతంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ పైన ఉన్న రైల్వే ట్రాక్‌పై (Railway track) ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వెనుక వైపు పొదల్లోంచి ఓ చిరుత పులి వేగంగా పట్టాల వైపునకు దూసుకొస్తుంది. అంతే వేగంగా పట్టాలకు మరో వైపు ఉన్న పొదల్లోకి వెళ్లిపోతుంది.

AC: ఏసీ తెచ్చిన తంటా.. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రపోతోంటే అర్ధరాత్రి దాటిన తర్వాత సడన్‌గా..!

వెనుక వైపు చప్పుడు అయినట్లు అనుమానం రావడంతో సదరు వ్యక్తి వెనక్కు తిరిగి చూస్తాడు. పులి (tiger) పొదల్లోకి వెళ్లడాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన మీద ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో.. వెంటనే పరుగందుకుంటాడు. అయితే పులి మాత్రం అతన్ని ఏమీ చేయకుండా అడవిలోకి వెళ్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడు లేచిన వేళావిశేషం మంచిదై ఉంటుంది’’.. అని కొందరు, ‘‘ఆ సమయంలో పులే కాదు.. రైలు వచ్చినా ప్రమాదమే’’.. అని మరికొందరు, ‘‘రైలు పట్టాలపై అలా నడవడం చాలా తప్పు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Ozempic: అసలేంటీ ఓజెంపిక్..? ఎలన్ మస్క్‌తో సహా చాలా మంది సెలబ్రెటీలంతా వాడే ఈ మెడిసన్ ఎందుకోసమంటే..!

Updated Date - 2023-08-05T21:50:12+05:30 IST