Ozempic: అసలేంటీ ఓజెంపిక్..? ఎలన్ మస్క్‌తో సహా చాలా మంది సెలబ్రెటీలంతా వాడే ఈ మెడిసన్ ఎందుకోసమంటే..!

ABN , First Publish Date - 2023-08-05T19:51:52+05:30 IST

ప్రస్తుతం సెలబ్రిటీలతో పాటూ సామాన్యులు కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరైతే ఫిట్‌నెస్ పేరుతో ప్రాణం మీదకు తెచ్చుకున్న సందర్భాలు, మరికొందరు ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి..

Ozempic: అసలేంటీ ఓజెంపిక్..? ఎలన్ మస్క్‌తో సహా చాలా మంది సెలబ్రెటీలంతా వాడే ఈ మెడిసన్ ఎందుకోసమంటే..!

ప్రస్తుతం సెలబ్రిటీలతో పాటూ సామాన్యులు కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరైతే ఫిట్‌నెస్ పేరుతో ప్రాణం మీదకు తెచ్చుకున్న సందర్భాలు, మరికొందరు ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా ఓజెంపిక్ మెడిసిన్ గురించే చర్చ నడుస్తోంది. ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్‌తో సహా చాలా మంది సెటబ్రెటీలంతా ఈ మందునే వాడుతుండడంతో అందరి దృష్టీ దీని పైనే పడింది. ఇంతకీ ఏంటీ ఓజెంపిక్ మెడిసిన్.. దేని కోసం వాడతారు.. తదితర వివరాలను తెలుసుకుందాం..

ప్రస్తుతం చాలా మంది సెలబ్రెటీలంతా ఓజెంపిక్ మెడిసిన్‌పై పడ్డారు. ఈ మందు ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చని ప్రచారం కావడంతో... చాలా మంది దీన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ (Type 2 diabetes) ప్రభావాన్ని తగ్గించే ఇంజెక్టెడ్ మెడిసినే (Ozempic Medicine) ఈ ఓజెంపిక్. దీన్ని వారానికి ఒక సారి వేసుకుంటారు. చాలా మంది దీన్ని వాడి తమ శరీర బరువులో సుమారు 10 శాతం తగ్గించుకున్నారని ఓ పరిశోధనలో వెళ్లడైంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఇది అత్యుత్తమ ఔషధమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ మందు.. గ్లూకోగాన్ లాంటి పెప్టైడ్-1 (GLP-1) రిసెప్టర్ అగోనిస్ అని, ఇది శరీరం అంతటా GLP-1 గ్రాహకాలను యాక్టివేట్ చేయడం, వాటి ప్రభావాలను మెరుగుపరచడంపై పనిచేస్తుందని కొందరు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు చెబుతున్నారు. మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేయడం ద్వారా బరువును తగ్గించి, అందుపులో ఉంచేందుకు సహకరిస్తుందని వివరిస్తున్నారు.

AC: ఏసీ తెచ్చిన తంటా.. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రపోతోంటే అర్ధరాత్రి దాటిన తర్వాత సడన్‌గా..!

551.jpg

డానిష్ పార్మాస్యూటికల్ సంస్థకు చెందిన నోవో నార్డిస్క్ (danish pharmaceutical company novo nordisk) తయారు చేసిన ఈ యాంటీ డయాబెటిక్ గ్రడ్‌ను.. యూఎస్‌లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మొదటిసారిగా 2017లో మధుమేహ చికిత్స కోసం ఆమోదించింది. తర్వాత 2021లో ఊబకాయ చికిత్స కోసం ఓజెంపిక్ అనే అధిక మోతాదు ఔషధాన్ని ఆమోదించారు. అప్పటి నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ప్రధానంగా ఎలన్ మస్క్‌తో (Elon Musk) పాటూ చాలా మంది నటీనటులు, నిర్మాతలు ఈ మెడిసిన్‌ను తీసుకోవడంతో మరింత ప్రాచుర్యం పొందింది. ఫిటినెస్‌గా ఎలా ఉండగలుగుతున్నారు.. అన్న ప్రశ్నకు.. వైగోవి బ్రాండ్ పేరుతో విక్రయించే ఓజెంపిక్ డ్రగ్ తీసుకుంటున్నట్లు ఎలన్ మస్క్‌ గతంలో సమాధానం ఇచ్చాడు. ఈయనతో పాటూ ప్రముఖ నటులు, నిర్మాతలు ఈ డ్రగ్ గురించి చర్చించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఓ కథనంలో పేర్కొంది. అయితే ఈ డ్రగ్‌పై మరికొందరు నిపుణులు మాట్లాడుతూ.. ఓజెంపిక్ డ్రగ్ వారానికోసారి ఇంజెక్ట్ చేసే మందు అని, అయితే ఇది మరీ అంత అద్భుత ఔషధమేమీ కాదని అంటున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం బరువు తగ్గాలనుకునే వారంతా ఈ మందు గురించి ఆన్‌లైన్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

Woman: ఆస్పత్రికి వచ్చిన 25 ఏళ్ల యువతి.. ఓ బాలింత గదిలోకి వెళ్లడంతో నర్సులకు డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

Updated Date - 2023-08-05T21:37:33+05:30 IST