Viral Video: నీ తెలివికి హ్యాట్సాఫ్ భయ్యా.. రైల్లో సీట్లు ఖాళీగా లేవని ఓ ప్రయాణీకుడి ప్లాన్ అదిరిపోయిందిగా..!

ABN , First Publish Date - 2023-08-05T18:11:05+05:30 IST

ప్రధానంగా బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు విపరీతమైన రద్దీ ఉంటుంది. కొన్నిసార్లు కనీసం అడుగు తీసి, అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అయినా ప్రయాణికులు మాత్రం.. త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతూనే ప్రయాణం సాగిస్తుంటారు. ఇక ముంబై వంటి ...

Viral Video: నీ తెలివికి హ్యాట్సాఫ్ భయ్యా.. రైల్లో సీట్లు ఖాళీగా లేవని ఓ ప్రయాణీకుడి ప్లాన్ అదిరిపోయిందిగా..!

ప్రధానంగా బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు విపరీతమైన రద్దీ ఉంటుంది. కొన్నిసార్లు కనీసం అడుగు తీసి, అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అయినా ప్రయాణికులు మాత్రం.. త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతూనే ప్రయాణం సాగిస్తుంటారు. ఇక ముంబై వంటి మహా నగరాల్లోని రైళ్ల ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడి లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసి మరీ ప్రయాణం చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్లో ఓ వ్యక్తి నిర్వాకానికి సంబంధించిన ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు.. ‘‘భయ్యా.. నీ ప్లాన్ అదుర్స్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగానే ముంబై లోకల్ రైళ్లలో (Mumbai Local Trains) రద్దీ విపరీతంగా ఉంటుంది. చివరకు మహిళలు కూడా బోగీకి వేలాడుతూ ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి ప్రస్తుత తరుణంలో ఓ యువకుడు బోగీలోని లగేజీ ర్యాక్‌పై (young man sleeping on luggage rack) పడుకోవడం చూసి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. లోపల సీట్లు ఖాలీ లేకపోవడంతో నేరుగా లగేజీ ర్యాక్ ఎక్కిన యువకుడు.. హాయిగా కాళ్లు చాచి పడుకున్నాడు.

Viral Video: ఈ ఎద్దు ఎంత పవర్‌ఫుల్లో.. కారుపై అటాక్ చేసి అమాంతం పైకి లేపేస్తోంది.. లోపల ఉన్న వాళ్లు బయటకు రాలేక..!

mumbai-trains-viral-photos.jpg

మొఖంపై ఓ చున్నీ కప్పుకొని ‘‘ఈ ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు’’.. అన్నట్లుగా హాయిగా నిద్రపోయాడు. ఈ సీన్ చూసి అక్కడున్న కొందరికి కోపం రాగా.. మరికొందరు తెగ నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం (Viral photos and videos) నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆహా! రాజయోగం అంటే ఇదేనేమో’’.. అని కొందరు, ‘‘నీ టైమ్ బాగుందిరా అబ్బాయ్’’.. అని మరికొందరు, ‘‘నీ తెలివికి హ్యాట్సాప్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Woman: ఆస్పత్రికి వచ్చిన 25 ఏళ్ల యువతి.. ఓ బాలింత గదిలోకి వెళ్లడంతో నర్సులకు డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

Updated Date - 2023-08-05T18:11:05+05:30 IST