Viral Video: ఈ ఇల్లు కట్టిన కాంట్రాక్టర్‌‌కి నిజంగా దండం పెట్టొచ్చు.. ఇంటి గోడలను చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

ABN , First Publish Date - 2023-08-06T16:43:37+05:30 IST

కాసులకు కక్కుర్తి పడి కొందరు చేసే పనులు ఇంకొందరి ప్రాణాల మీదకు వస్తుంటాయి. ప్రధానంగా రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంలో కొందరు చేపట్టే నాసిరకం పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వేసిన కొన్ని రోజులకే దెబ్బతింటుంటాయి. ఇక వర్షాకాలంలో...

Viral Video: ఈ ఇల్లు కట్టిన కాంట్రాక్టర్‌‌కి నిజంగా దండం పెట్టొచ్చు.. ఇంటి గోడలను చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

కాసులకు కక్కుర్తి పడి కొందరు చేసే పనులు ఇంకొందరి ప్రాణాల మీదకు వస్తుంటాయి. ప్రధానంగా రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంలో కొందరు చేపట్టే నాసిరకం పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వేసిన కొన్ని రోజులకే దెబ్బతింటుంటాయి. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సమస్యలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ ఇంటి వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘ఈ ఇల్లు కట్టిన కాంట్రాక్టర్‌‌కి నిజంగా దండం పెట్టొచ్చు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇంటి గోడలను చూస్తే మీరు కూడా నొరెళ్లబెడతారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఐర్లాండ్‌లోని (Ireland) డోనెగల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకంటే నాసిరకం పనులు ఎవరూ చేయలేరు.. అన్న విధంగా ఈ ఇంటి నిర్మాణం (house Construction) జరిగింది. పనుల్లో డొల్లతనాన్ని ఓ వ్యక్తి కళ్లకు కట్టినట్లు చూపించాడు. వర్షంలో తడిసిన ఓ ఇంటిని ఎంచుకుని, బీటలు వారిన ఇంటి గోడలను చేత్తో పెకిలించాడు. అందులో ఉన్న ఇటుకలను ఒక్కొక్కటిగా చేత్తోనే తీసి పక్కన విసిరేశాడు. పట్టుకుంటే చాలు ఊడి వస్తున్న (poor quality bricks) ఇటుకలను చూసి అవాక్కయ్యాడు. వాటిని కింద పడేయగా పిండి పిండి అవుతున్నాయి.

Viral Video: రైల్వే పట్టాలపై నడుస్తూ వెనక్కు తిరిగి చూడగా షాకింగ్ సీన్.. రైలుకు బదులుగా ఏమొచ్చిందంటే..

ఇలాంటి ఇళ్లల్లో ఉండే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంటి చుట్టు పక్కల చాలా ఇళ్ల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడున్న వారంతా ఇళ్లను ఖాళీ చేసి దూరంగా వేరే ఇళ్లలో ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిపుణుల బృందం దీనిపై పరిశీలన చేస్తున్న చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఇళ్లు.. దొంగలకు పండుగే’’.. అని కొందరు, ‘‘ఇలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి’’.. అని మరి కొందరు, ‘‘అయ్యో! ఇది మరీ ఘోరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman: ఆస్పత్రికి వచ్చిన 25 ఏళ్ల యువతి.. ఓ బాలింత గదిలోకి వెళ్లడంతో నర్సులకు డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

Updated Date - 2023-08-06T16:43:37+05:30 IST