Viral Video: బుల్లెట్ వేగంతో ఇతడు తయారు చేసిన భేల్ పూరీ చూస్తే.. షాకవ్వడం మాత్రం ఖాయం..

ABN , First Publish Date - 2023-06-06T15:28:18+05:30 IST

ఆహార పదార్థాల తయారీలో ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. ఒకే వంటకాన్ని చాలా మంది వివిధ రకాలుగా చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. కొందరు వివిధ రకాల ప్లేవర్లను జత చేసి సరికొత్త రుచులను అందిస్తుంటే.. మరికొందరు తయారీలోనే తమదైన స్టైల్‌ని చూపిస్తూ సోషల్ మీడియలో వైరల్ అవుతుంటారు. ఇలాంటి..

Viral Video: బుల్లెట్ వేగంతో ఇతడు తయారు చేసిన భేల్ పూరీ చూస్తే.. షాకవ్వడం మాత్రం ఖాయం..

ఆహార పదార్థాల తయారీలో ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. ఒకే వంటకాన్ని చాలా మంది వివిధ రకాలుగా చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. కొందరు వివిధ రకాల ప్లేవర్లను జత చేసి సరికొత్త రుచులను అందిస్తుంటే.. మరికొందరు తయారీలోనే తమదైన స్టైల్‌ని చూపిస్తూ సోషల్ మీడియలో వైరల్ అవుతుంటారు. ఇలాంటి వ్యాపారులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి భేల్ పూరీని బుల్లెట్ వేగంతో తయారు చేసే విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ‘‘డాన్సింగ్ భేల్ పూరీ’’ విక్రేత ప్రస్తుతం ఓ సెలబ్రిటీగా మారిపోయాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ముంబైకు చెందిన ఓ చిరు వ్యాపారి (Mumbai businessman) ..భేల్ పూరీని వినూత్నంగా తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముందుగా ఓ పాత్రలోకి కొన్ని బొరుగులను తీసుకున్న వ్యక్తి.. తర్వాత అందులో సుమారు 60 రకాల పదార్థాలను వేస్తాడు. తర్వాత వాటిని అత్యధిక వేగంతో మిక్స్ చేస్తాడు. అది కూడా తనదైన స్టైల్లో డాన్స్ మూమెంట్స్ వేస్తూ మిక్స్ చేస్తాడు. ఫైనల్‌గా భేల్ పూరి (Bhel Puri) రెడీ అంటూ ఓ ప్లేట్‌లో వేసి కస్టమర్‌కు అందిస్తాడు.

Viral Video: వద్దు వద్దు అని వధువు అంటున్నా వినిపించుకోని వ్యక్తి.. చివరకు అందరి ముందూ ఏం చేశాడో మీరే చూడండి..

ఇతడు భేల్ పూరీ చేసే విధానం అందరికీ నచ్చడంతో కస్టమర్లు అక్కడికి క్యూ కడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యాపారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్!.. ఇతటి టాలెంట్ సూపర్’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది’’.. అని మరికొందరు, ‘‘డాన్సింగ్ భేల్ పూరి అద్భుతం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral News: తీరా దండ వేసే సమయంలో వరుడిని చూసి బోరున విలపించిన వధువు.. బంధువులంతా చెబుతున్నా వినిపించుకోకుండా.. చివరకు ఏం చేసిందంటే..

Updated Date - 2023-06-06T15:28:18+05:30 IST