Viral News: తీరా దండ వేసే సమయంలో వరుడిని చూసి బోరున విలపించిన వధువు.. బంధువులంతా చెబుతున్నా వినిపించుకోకుండా.. చివరకు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-06-04T21:34:25+05:30 IST

కొన్నిసార్లు కొందరు సమయం, సందర్భం లేకుండా చేసే చిన్న చిన్న తప్పులు.. చివరకు పెద్ద గొడవకు దారి తీస్తుంటాయి. చాలా మంది ఎక్కడ ఎలా ప్రవర్తించాలి.. అనే కనీస జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తుంటారు. తీరా తప్పు తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయి ఉంటుంది. తాజగా...

Viral News: తీరా దండ వేసే సమయంలో వరుడిని చూసి బోరున విలపించిన వధువు.. బంధువులంతా చెబుతున్నా వినిపించుకోకుండా.. చివరకు ఏం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు కొందరు సమయం, సందర్భం లేకుండా చేసే చిన్న చిన్న తప్పులు.. చివరకు పెద్ద గొడవకు దారి తీస్తుంటాయి. చాలా మంది ఎక్కడ ఎలా ప్రవర్తించాలి.. అనే కనీస జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తుంటారు. తీరా తప్పు తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయి ఉంటుంది. తాజగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. వివాహ కార్యక్రమంలో తీరా దండ వేసే సమయంలో వరుడిని చూసిన వధువు ఒక్కసారిగా బోరున విలపించింది. విషయం తెలుసుకుని బంధువులంతా ఎంత నచ్చజెప్పాలని చూసిన వినిపించుకోని వధువు.. చివరకు ఏం చేసిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఖషీనగర్‌లోని సేవరాహి ప్రాంత పరిధి తివారిపట్టి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతికి బీహార్ (Bihar) ప్రావిన్స్ పరిధి భూల్‌పట్టి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. శుక్రవారం ముహూర్థం ఫిక్స్ చేయడంతో తివారిపట్టి గ్రామంలో పెళ్లి సందడి మొదలైంది. యువతి (young woman) ఇల్లు.. అతిథులతో నిండిపోయింది. అంతా సరదా సరదాగా గడుపుతున్న సమయంలో ఊరేగింపు సమయం రానే వచ్చింది. వరుడి కుటుంబ సభ్యులు తమ బంధువులతో కలిసి శుక్రవారం సాయంత్రం వధువు (bride) గ్రామానికి చేరుకున్నారు. ద్వార పూజ అనంతరం జయమాల కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేశారు. వధువు అందంగా ముస్తాబై వేదిక పైకి వెళ్లింది. వరుడు (groom) కూడా పెళ్లి దుస్తుల్లో స్టేజి పైకి వెళ్లాడు.

Viral Video: వద్దు వద్దు అని వధువు అంటున్నా వినిపించుకోని వ్యక్తి.. చివరకు అందరి ముందూ ఏం చేశాడో మీరే చూడండి..

అంతా ఆనందంగా ఉన్న ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తీరా దండ వేసే సమయంలో వరుడిని చూసి వధువు షాక్ అయింది. వరుడు మద్యం మత్తులో (drunken groom) ఉండడం చూసి.. గట్టిగా కేకలు పెడుతూ బోరున విలపించింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ‘‘ఇలాంటి వాన్ని భర్తగా ఊహించుకోలేను.. నాకీ పెళ్లి వద్దు’’.. అంటూ వధువు భీష్మించుకుంది. బంధువులంతా ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. గ్రామ పెద్దలు కలుగజేసుకుని నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో చివరకు పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. పోలీసులు నచ్చజెప్పినా వధువు ససేమిరా అనడంతో చివరకు చేసేదేలేక.. వరుడు కుటుంబం తీసుకున్న కట్నం డబ్బులను కూడా వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Rakul Preet Singh: బికినీతో బీచ్‌లో రచ్చ రచ్చ చేస్తోన్న రకుల్..!

Updated Date - 2023-06-05T15:55:35+05:30 IST