Viral Video: కోతితో స్నేహం చేసిన కప్ప.. మరో కోతి దగ్గరికి రాగానే ఎలా రియాక్షన్ ఇచ్చిందో చూడండి..

ABN , First Publish Date - 2023-08-08T15:26:10+05:30 IST

స్నేహానికి హద్దులు సరిహద్దులతో పాటూ కుల, మత, వర్గ, లింగ, జాతి భేదాలు కూడా ఉండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని జంతువులు మనుషులతో స్నేహం చేయడం చూస్తుంటాం. అలాగే బద్ధ శత్రువులైన కొన్ని జంతువులు ఉన్నట్టుండి దోస్త్ మేరా దోస్త్.. అంటూ...

Viral Video: కోతితో స్నేహం చేసిన కప్ప.. మరో కోతి దగ్గరికి రాగానే ఎలా రియాక్షన్ ఇచ్చిందో చూడండి..

స్నేహానికి హద్దులు సరిహద్దులతో పాటూ కుల, మత, వర్గ, లింగ, జాతి భేదాలు కూడా ఉండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని జంతువులు మనుషులతో స్నేహం చేయడం చూస్తుంటాం. అలాగే బద్ధ శత్రువులైన కొన్ని జంతువులు ఉన్నట్టుండి దోస్త్ మేరా దోస్త్.. అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కోతులు, కప్పకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కోతితో స్నేహం చేసిన ఓ కప్ప.. మరో కోతి దగ్గరికి రాగానే ఎలా రియాక్షన్ ఇచ్చిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కోతి, కప్పకు మధ్య స్నేహం కుదురుతుంది. మెల్లగా కప్ప వద్దకు వచ్చిన కోతి దాని వీపుపై కాలితో తాకుతుంది. అయినా కప్ప అక్కడి నుంచి కదలకుండా అలాగే ఉండిపోతుంది. ఇలా కొద్ది సేపు ఆ రెండూ సరదాగా టైమ్ పాస్ చేస్తాయి. తర్వాత మరో కోతి అక్కడికి వస్తుంది. దీంతో కప్పకు ఎక్కడ లేని (frog angry when saw the monkey) కోపం వస్తుంది. ‘‘మా మధ్య నువ్వెవరు... ఇక్కడి నుంచి వెళ్లిపో’’.. అన్నట్లుగా కోతిపై కసురుకుంటుంది.

Snakes video: అమ్మా తల్లి.. అవి పాములనుకున్నావా? లేక జిమ్ రోప్స్ అనుకున్నావా?.. అలా రప్ఫాడించావ్!!!

దీంతో కోతి షాక్ అవుతుంది. ‘‘నాతో కూడా ఫ్రెండ్‌షిప్ చేయొచ్చుగా’’.. అన్నట్లుగా కప్పను తాకుతూ పదే పదే రిక్వెస్ట్ చేసుకుంటుంది. అయినా కప్ప మాత్రం ‘‘నాకు నీ స్నేహం అవసరం లేదు’’.. అన్నట్లుగానే ప్రవర్తిస్తుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కప్ప వెరీ స్మార్ట్ గురూ’’.. అంటూ కొందరు, ‘‘కప్ప కోపం చూస్తుంటే కామెడీగా ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పిల్లి మరీ సిల్లీగా ఉన్నట్టుందే.. తన తోకతో తానే ఎలా ఫైట్ చేస్తోందో చూడండి..

Updated Date - 2023-08-08T15:26:10+05:30 IST