Snakes video: అమ్మా తల్లి.. అవి పాములనుకున్నావా? లేక జిమ్ రోప్స్ అనుకున్నావా?.. అలా రప్ఫాడించావ్!!!

ABN , First Publish Date - 2023-08-06T19:40:32+05:30 IST

కొందరు ప్రమాదమని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఇంకొందరు పది మందిలో తమ ప్రత్యేకత నిలుపుకొనేందుకు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. చాలా మంది విష సర్పాలతో ఆటలు ఆడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో...

Snakes video: అమ్మా తల్లి.. అవి పాములనుకున్నావా? లేక జిమ్ రోప్స్ అనుకున్నావా?..  అలా రప్ఫాడించావ్!!!

కొందరు ప్రమాదమని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఇంకొందరు పది మందిలో తమ ప్రత్యేకత నిలుపుకొనేందుకు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. చాలా మంది విష సర్పాలతో ఆటలు ఆడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో వాటి కాటుకు గురై ఎంతో మంది చనిపోయిన సందర్భాలను కూడా చూశాం. కొందరు స్నేక్ క్యాచర్లు పాములను అత్యంత చాకచక్యంగా పట్టుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సదరు యువతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒట్టి చేతులతో పాములను పట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అమ్మా తల్లి.. పాములనుకున్నావా? అవి జిమ్ రోప్స్ అనుకున్నావా?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో (Viral video) ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి (young woman) కాలువ పక్కన రెండు పెద్ద విష సర్పాలు (Venomous snakes) ఉండడాన్ని గమనిస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా వాటి వద్దకు వెళ్తుంది. వెళ్లీ వెళ్లగానే వాటి తోకలు పట్టుకుని... ఎలాగైతే జిమ్‌ సెంటర్లలో బ్యాటిల్ రోప్ వర్కవుట్స్ చేస్తామో.. ఆ తరహాలో వాటి తోకలు పట్టుకుని అటూ ఇటూ తిప్పుతుంది. అవి కాటు వేస్తాయన్న భయం.. ఆమెలో ఇసుమంత కూడా కనిపించదు. ఆమె నుంచి తప్పించుకునేందుకు ఓ పాము కాలువలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: చెమటలు పట్టించిన విమాన ప్రయాణం.. మధ్యలో టిష్యూతో పెద్ద ఇష్యూ!

అయినా ఆమె ఆ పామును వదలకుండా లోపలికి దూకిమరీ పట్టుకుని బయటికి లాక్కొస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ అమ్మాయి వెరీ ట్యాలెంటెడ్‌గా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పాములకు చక్కలు చూపించిందిగా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ఇల్లు కట్టిన కాంట్రాక్టర్‌‌కి నిజంగా దండం పెట్టొచ్చు.. ఇంటి గోడలను చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

Updated Date - 2023-08-06T19:42:14+05:30 IST