Crime news: మత్తులో ఉన్న ప్రియురాలిని కారులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో శృంగారం చేయాలని ప్రేయసి కోరడంతో..

ABN , First Publish Date - 2023-09-12T18:42:04+05:30 IST

ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. భార్యకు తెలీకుండా మరో యువతితో ప్రేమాయణం మొదలెట్టాడు. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆమెతో ఏకంగా సహజీవనమే మొదలెట్టాడు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు మత్తులో ఉన్న ప్రియురాలిని కారులో..

Crime news: మత్తులో ఉన్న ప్రియురాలిని కారులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో శృంగారం చేయాలని ప్రేయసి కోరడంతో..
ప్రతీకాత్మక చిత్రం

ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. భార్యకు తెలీకుండా మరో యువతితో ప్రేమాయణం మొదలెట్టాడు. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆమెతో ఏకంగా సహజీవనమే మొదలెట్టాడు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు మత్తులో ఉన్న ప్రియురాలిని కారులో ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యలో శృంగారం చేయాలని ప్రేయసి ఒత్తిడిచేసింది. అయితే చివరకు అతడు చేసిన నిర్వాకంతో చివరకు విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరాఖండ్ (Uttarakhand) డెహ్రాడూన్‌ పరిధి పండిట్‌వాడి ప్రాంతానికి చెందిన రామెందు ఉపాధ్యాయ్ అనే వ్యక్తి డెహ్రాడూన్‌లోని క్లెమెంట్ టౌన్‌లో ఆర్మీ (Army) లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేస్తున్నాడు. ఇతడి భార్య ప్రస్తుతం వారి సొంతూరులో ఉంటోంది. ఇదిలావుండగా, డెహ్రాడూన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రామెందుకు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ బార్‌లో పని చేస్తున్న శ్రేయా శర్మతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి (Extramarital affair) దారి తీసింది. రామెందు తన భార్యకు తెలీకుండా శ్రేయాతో ఏకంగా కాపురమే పెట్టేశాడు. డెహ్రాడూన్‌లో గది అద్దెకు తీసుకుని ఆమెతో సహజీవనం (Live in relationship) మొదలెట్టాడు. అయితే కొన్నాళ్లకు ఈ విషయం తన భార్యకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో తన ప్రియురాలిని కొన్నాళ్ల పాటు వేరే చోట ఉంచాడు. తరచూ వెళ్లి ప్రియురాలిని పరామర్శిస్తూ ఉండేవాడు. అయితే ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని శ్రేయా శర్మ ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి.

Viral Video: చెబితే నమ్మరు గానీ.. టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. కాలు జారి ఇలా కింద పడ్డాడో లేదో.. అంతలోనే..

young-women-crime.jpg

ఓ వైపు భార్యతో గొడవ, మరోవైపు పెళ్లి చేసుకోమంటూ ప్రియురాలు గొడవ చేయడంతో విసిగిపోయాడు. చివరకు ప్రియురాలిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సెప్టెంబర్ 9న శ్రేయా శర్మను కారులో పార్టీకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు ఫుల్‌గా మద్యం తాగించాడు. అప్పటికే కారు వెనుక సీట్లో ఓ సుత్తి, టాయిలెట్ క్లీనర్ బాటిల్‌ను సిద్ధంగా ఉంచుకున్నాడు. మద్యం తాగిన అనంతరం తిరిగి ఇద్దరూ కారులో బయలుదేరారు. అయితే ఆమెను ఇంటికి కాకుండా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కారు ఆపగానే మత్తులో ఉన్న ప్రియురాలు శృంగారం చేయాలని కోరింది. అయితే అతడు మాత్రం సుత్తి తీసుకుని ఆమెపై (Assault on girlfriend) దాడి చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నా.. ఆమె నోట్లో టాయిలెట్ క్లీనర్ పోసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

police.jpg

Viral Video: ఉన్నట్టుండి వరుడి మొఖంలో తేడా గమనించిన వధువు.. పక్కన ఉన్న వ్యక్తిని కూడా వదలకుండా చివరికి ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-09-12T18:42:04+05:30 IST