Viral Video: అరే! ఏంటిది భయ్యా.. కొంచెం కూడా భయం లేదా.. పామును చూడగానే ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2023-09-10T21:54:51+05:30 IST

పామును చూడగానే పారిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఏ పామైనా పొరపాటున సమీపానికి వచ్చిందంటే ఇక గుండె ఆగినంత పనవుతుంది. పాముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చాలా మందిని చూశాం. అయితే కొందరు మాత్రం...

Viral Video: అరే! ఏంటిది భయ్యా.. కొంచెం కూడా భయం లేదా.. పామును చూడగానే ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

పామును చూడగానే పారిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఏ పామైనా పొరపాటున సమీపానికి వచ్చిందంటే ఇక గుండె ఆగినంత పనవుతుంది. పాముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చాలా మందిని చూశాం. అయితే కొందరు మాత్రం పాములు పట్టడంలో చాలా నేర్పుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి ఘటలనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఓ వ్యక్తి పామును పట్టడంలో చూపిన తెగువ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. కోళ్లు (chickens) ఉన్న ప్రాంతంలోకి ఓ పెద్ద పాము (snake) రావడంతో కుటుంబ సభ్యులు కంగారుపడిపోతారు. ఎక్కడ తమ కోళ్లను చంపేస్తుందో అని భయపడి వెంటనే స్కేక్ క్యాచర్‌కు సమాచారం అందిస్తారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న యువకుడిని పాము ఉన్న ప్రాంతానికి తీసుకెళ్తారు. ఇనుప కంచెలో కోళ్ల మధ్య పాము అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తుంది. కోళ్లపై దాడి చేయలేదు గానీ.. బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. కాసేపు పామును గమనించిన వ్యక్తి.. ఎలాంటి భద్రతా చర్యలూ తీసుకోకుండా ఇనుప కంచెను పైకెత్తి (young man cleverly caught the snake) చేయి లోపలి పెట్టి పామును పట్టుకుంటాడు.

Viral Video: మంచిదంటూ.. మట్టి కుండలో నెయ్యి వేసి పోపు పెడుతున్నారా.. అయితే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి..

అప్పటికే బుసలు కొడుతున్న పాము.. వ్యక్తి పట్టుకోగానే మరింత ఆవేశంతో కాటు వేయాలని చూస్తుంది. అయినా సదరు వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా ఎంతో చాకచక్యంగా దాన్ని పట్టుకుని సంచిలో వేసేస్తాడు. పామును పాములా కాకుండా గంప కింద కోడిలా భావించి అతను పట్టుకున్న తీరును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇతడికి భయమనేది తెలీనట్లుంది’’.. అని కొందరు, ‘‘మొత్తానికి పామును భలే పట్టేశాడే’’.. అని మరికొందరు, ‘‘ ఎంత అనుభవం ఉన్నా.. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: దీని టాలెంట్ మామూలుగా లేదు భయ్యో!.. మూసి ఉన్న డోరు వద్దకు వెళ్లిన పిల్లి.. ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందంటే..

Updated Date - 2023-09-10T21:54:51+05:30 IST