Viral Video: పామును చూసి మగాళ్లే భయపడి పారిపోతుంటే.. సడన్‌గా సీన్‌లోకి వచ్చిన యువతి.. చివరకు ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-09-09T21:48:29+05:30 IST

పాము అనే పేరు వింటేనే ఎవరికైనా ఏదో తెలీని భయం పుట్టుకొస్తుంది. ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు తప్ప పాములను పట్టుకునేందుకు ఇంకెవరూ సాహసం చేయరు. పట్టుకోవడం కాదు కాదా.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడతారు. స్నేక్ క్యాచర్లలో కూడా...

Viral Video: పామును చూసి మగాళ్లే భయపడి పారిపోతుంటే.. సడన్‌గా సీన్‌లోకి వచ్చిన యువతి.. చివరకు ఏం చేసిందో చూడండి..

పాము అనే పేరు వింటేనే ఎవరికైనా ఏదో తెలీని భయం పుట్టుకొస్తుంది. ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు తప్ప పాములను పట్టుకునేందుకు ఇంకెవరూ సాహసం చేయరు. పట్టుకోవడం కాదు కాదా.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడతారు. స్నేక్ క్యాచర్లలో కూడా ఎక్కువగా మగవారే పాములను పట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు ఓ యువతి సాహసం చూసి నెటిజన్లు అవాక్కతున్నారు. పామును చూసి మగాళ్లంతా భయపడి పారిపోతుంటే.. సడన్‌గా అక్కడికి వచ్చిన యువతి.. చివరికి ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. రేకుల ఇళ్లల్లోకి ఓ నాగు పాము (Cobra) చొరబడుతుంది. దాన్ని చూడగానే అంతా భయంతో పరుగందుకుంటారు. చూస్తుండనే పాము ఓ రేకుల ఇంట్లోకి దూరిపోతుంది. అయినా దాన్ని అక్కడి నుంచి పంపించే సాహసం ఎవరూ చేయలేరు. ఇంతలో, సమాచారం అందుకున్న యువతి.. సడన్‌గా సీన్‌లోకి ఎంటరవుతుంది. వచ్చీ రాగానే పాము దూరిన ఇంట్లోకి వెళ్తుంది. లోపల మట్టి నేలపై ఉన్న రంధ్రంలోకి దూరిన పామును (young woman catch the snake) ఎలాగోలా బయటికి లాక్కొస్తుంది. చివరకు బయటికి వచ్చిన పెద్ద నాగు పామును చూసి చుట్టూ ఉన్న వారంతా భయంతో ఆమడదూరం పారిపోతారు.

Love Story: కాలేజీలో పనిచేయడానికి వచ్చిన ఓ కుర్రాడితో ప్రేమలో పడిన ఇంటర్ అమ్మాయి.. ఇంట్లో ఒప్పుకోలేదని ఏం చేసిందంటే..!

యువతి మాత్రం ఎంతో చాకచక్యంగా పామును పట్టుకుని బయటికి తీసుకొస్తుంది. అంతా చూస్తుండగానే పామును పట్టుకుని బ్యాగులోకి పంపిస్తుంది. దీంతో అక్కడున్న వారంతా.. హమ్మయ్య! అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. పాముల పట్ల అక్కడున్న వారికి అవగాహన కల్పించిన యువతి.. చివరికి ఆ పామును తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఎంత పెద్ద పాము’’.. అని కొందరు, ‘‘ఈ యువతి ధైర్యానికి సెల్యూట్’’.. అని మరికొందరు, ‘‘పాములు పట్టుకునే యువతులను చాలా అరుదుగా చూస్తుంటాం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

KBC Winner: 22 ఏళ్ల క్రితం కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచిన ఈ పిల్లాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే..!

Updated Date - 2023-09-09T21:48:29+05:30 IST