Husband: అయ్యో పాపం.. అంటూ ఓ భర్తపై జాలిపడుతున్న నెటిజన్లు.. ట్రూ కాలర్‌లో అతడి ఫోన్ నెంబర్‌కు ఉన్న పేరును చూసి..!

ABN , First Publish Date - 2023-09-09T16:32:13+05:30 IST

స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వాట్సప్, ఫేస్‌బుక్ తదితర యాప్‌లతో పాటూ ట్రూ కాలర్ యాప్‌ను కూడా విధిగా వాడుతుంటారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చే సందర్భంలో వారి పేరు తెలుసుకునే వెసులుబాటు ఉండడంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ క్రమంలో...

Husband: అయ్యో పాపం.. అంటూ ఓ భర్తపై జాలిపడుతున్న నెటిజన్లు.. ట్రూ కాలర్‌లో అతడి ఫోన్ నెంబర్‌కు ఉన్న పేరును చూసి..!
ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వాట్సప్, ఫేస్‌బుక్ తదితర యాప్‌లతో పాటూ ట్రూ కాలర్ యాప్‌ను కూడా విధిగా వాడుతుంటారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చే సందర్భంలో వారి పేరు తెలుసుకునే వెసులుబాటు ఉండడంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్ని నంబర్లకు సంబంధించిన పేర్లు చిత్రవిచిత్రంగా ఉండడం చూస్తూ ఉంటాం. తాజాగా, ఓ భర్త ఫోన్ నంబర్‌ను ట్రూ కాలర్‌లో సెర్చ్ చేయగా.. వచ్చిన పేరును చూసి అతడిపై నెటిజన్లు జాలి పడుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫోన్ నంబర్ ట్రూ కాలర్‌లో (True Caller) సెర్చ్ చేయగా.. ‘‘కాజల్ భర్త’’ అని రావడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఫోన్ నంబర్‌ను ఇలాక్కూడా సేవ్ చేసుకుంటారా.. అంటూ నివ్వెరపోతున్నారు. ఈ ట్రూ కాలర్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అందులోనూ భర్త (Husband) పేరుకు రాసిన స్పెల్లింగ్ చూసి కూడా చాలా మంది తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఫొటో (Viral photo) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది నిజమైన స్త్రీవాదం’’.. అని కొందరు, ‘‘ఇతడికి భార్య అంటే ఎంత గౌరవమో’’.. అని మరికొందరు, ‘‘ఆదర్శ దంపతులు అంటే వీరే’’.. అని ఇంకొందరు, మరోవైపు చాలా మంది ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అపార్ట్‌మెంట్‌లో వేకువజాము సమయంలోనే చోరీ.. ఇళ్లల్లోకి చొరబడకుండా దొంగలు చేసిన పనిని.. సీసీ కెమెరాల్లో చూసి చివరకు అంతా షాక్..

Updated Date - 2023-09-09T16:32:13+05:30 IST