Viral Video: అపార్ట్‌మెంట్‌లో వేకువజాము సమయంలోనే చోరీ.. ఇళ్లల్లోకి చొరబడకుండా దొంగలు చేసిన పనిని.. సీసీ కెమెరాల్లో చూసి చివరకు అంతా షాక్..

ABN , First Publish Date - 2023-09-09T15:47:48+05:30 IST

కొన్ని చోరీలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడే దొంగలు ఎవరికీ అనుమానం రాకుండా ఎంతో చాకచక్యంగా చోరీలు చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి చోరీ ఘటనలకు సంబంధించిన వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా...

Viral Video: అపార్ట్‌మెంట్‌లో వేకువజాము సమయంలోనే చోరీ.. ఇళ్లల్లోకి చొరబడకుండా దొంగలు చేసిన పనిని.. సీసీ కెమెరాల్లో చూసి చివరకు అంతా షాక్..

కొన్ని చోరీలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడే దొంగలు ఎవరికీ అనుమానం రాకుండా ఎంతో చాకచక్యంగా చోరీలు చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి చోరీ ఘటనలకు సంబంధించిన వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో వేకువజాము సమయంలో చోరీ జరిగింది. చివరకు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఇళ్లల్లోకి చొరబడకుండా దొంగలు చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని (Bangalore) శాంతినగర్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అపార్ట్‌మెంట్లలో వేకువజాము సమయంలో తరచూ చోరీలు జరుగుతున్నాయి. కానీ ఇళ్లల్లో ఎలాంటి వస్తువులూ చోరీ కాలేదు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులకు అనుమానం వచ్చి ఇటీవల సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. వేకువజాము 3గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌లోకి పెద్ద పెద్ద సంచులు పట్టుకుని దొంగలు (thieves) చొరబడ్డారు. ఎవరి ఇంట్లోకి వెళ్లకుండా.. కేవలం తలుపు వద్ద ఉన్న స్టాండ్‌లోని బూట్లు, చెప్పులను సంచుల్లో వేసుకున్నారు.

Viral Video: ఇంటిని కొన్నందుకు పంట పండిందనుకున్నారు.. చివరకు గోడలు బద్ధలు కొట్టగా బయటపడిన వస్తువులు చూసి షాక్..

గంట వ్యవధిలో అపార్ట్‌మెంట్ మొత్తం అన్ని ఇళ్ల వద్ద బూట్లను (shoes Theft) సంచుల్లో వేసుకుని ఎత్తుకెళ్లారు. నెల రోజుల్లో ఇలాంటి చోరీలు జరగడం.. ఇది మూడోసారి అని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ఇంటి బయట చెప్పులు వదలాలంటేనే జనం భయపడుతున్నారు. కాగా, ఈ చోరీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ దొంగలు చాలా వెరైటీగా ఉన్నారే’’.. అని కొందరు, ‘‘దొంగలంతా కలిసి చెప్పుల షాప్ ఓపెన్ చేశారేమో’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే జరుగుతుంది.. అర్ధరాత్రి రోడ్డుపై ఈ యువతికి ఏమైందో చూడండి..

Updated Date - 2023-09-09T15:47:48+05:30 IST