Future ATMs: భవిష్యత్తులో ఏటీఎంలు ఇలాగే ఉండబోతున్నాయ్.. డబ్బుల్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..!

ABN , First Publish Date - 2023-09-07T20:34:04+05:30 IST

రోజులు మారే కొద్దీ.. టెక్నాలజీలోనూ అంతే మార్పులు వస్తున్నాయి. చిటికేస్తే కోరుకున్నది వచ్చినట్లుగా.. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంట్లోకి వచ్చి చేరుతోంది. ఇక నగదు లావాదేవీల విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. జేబులో...

Future ATMs: భవిష్యత్తులో ఏటీఎంలు ఇలాగే ఉండబోతున్నాయ్.. డబ్బుల్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..!

రోజులు మారే కొద్దీ.. టెక్నాలజీలోనూ అంతే మార్పులు వస్తున్నాయి. చిటికేస్తే కోరుకున్నది వచ్చినట్లుగా.. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంట్లోకి వచ్చి చేరుతోంది. ఇక నగదు లావాదేవీల విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. జేబులో క్యాష్‌, ఏటీఎం కార్డుకు బదులుగా ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్నట్లుగా మారిపోయింది. దీంతో ఏటీఎంలతో దాదాపు అవసరం లేకుండా పోయింది. అయితే ఇలాంటి తరుణంలో ఫ్యూచర్ ఏటీఎంలో భారీ మార్పులు రాబోతున్నాయనే విషయాన్ని ధ్రువీకరించేలా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ భవిష్యత్ ఏటీఎంలలో డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Union Minister Piyush Goyal) తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో (Global FinTech Fest 2023) ఈ కార్డ్‌లెస్ ఏటీఎంను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. భారతదేశ మొట్టమొదటి UPI ATM గా పిలిచే ఇందులో ఏటీఎం కార్డు లేకుండానే క్యాష్ తీసుకునే వెసులుబాటును కల్పించారు. ఇందుకోసం ముందుగా ఈ ఏటీఎంలోని UPI CARDLESS CASH అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీకు అవసరమైన మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై యూపీఐ క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే అవుతుంది. అనంతరం మీ మొబైల్ యాప్‌ నుంచి క్యూఆర్ కోడ్‌ను (QR code) స్కాన్ చేయాల్సి ఉంటుంది.

Wife-Husband: కూరగాయలు తెమ్మంటూ భర్తకు ఓ స్లిప్ ఇచ్చిందో భార్య.. ఆమె రాసింది చదివి నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

అనంతరం మీ పిన్ నంబర్ ఎంటర్ ద్వారా మీకు కావాల్సిన నగదు మిషన్ నుంచి బయటికి వచ్చేస్తుంది. షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎలా చేస్తామో.. అచ్చం అలాగే ఇక్కడా చేసి నగదును తీసుకోవచ్చన్నమాట. అయితే ఈ కొత్త ఏటీఎం ప్రస్తుతం BHIM UPI యాప్‌కు మాత్రమే సపోర్టు చేస్తోంది. భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యాప్‌లకూ సపోర్టు చేసేలా తీర్చిదిద్దనున్నారు. దశల వారీగా ఈ ఏటీఎం మిషన్‌ను అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఏటీఎంకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హమ్మయ్య!.. ఇక ఏటీఎంతో కూడా పని లేదన్నమాట’’.. అని కొందరు, ‘‘గేమ్ ఛేంజర్ అంటే ఇదేనేమో’’.. అని మరికొందరు, ‘‘క్యాష్ కావాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఒకే బైక్‌పై ముగ్గురు అమ్మాయిలు.. పోలీస్ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలకు.. ఈ యువతుల రెస్పాన్స్ వింటే..!

Updated Date - 2023-09-07T20:46:29+05:30 IST