Viral Video: సింహాలను వణికించిన ఖడ్గమృగాలు.. పడుకున్న సింహాలను టచ్ కూడా చేయకుండా ఎలా భయపెట్టాయో చూడండి..

ABN , First Publish Date - 2023-09-07T18:49:36+05:30 IST

తాటిని తన్నేవాడుంటే.. వాడిని తలదన్నే వాడుంటాడు.. అన్న చందంగా నన్ను మించిన వాడు లేడు.. అని విర్రవీగే వారికి ఏదో ఒక రోజు గర్వభంగం అవుతుంటుంది. ఇది మనుషుల విషయంలోనే కాకుండా జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది. అడవులకు రారాజు అయిన సింహం కూడా..

Viral Video: సింహాలను వణికించిన ఖడ్గమృగాలు.. పడుకున్న సింహాలను టచ్ కూడా చేయకుండా ఎలా భయపెట్టాయో చూడండి..

తాటిని తన్నేవాడుంటే.. వాడిని తలదన్నే వాడుంటాడు.. అన్న చందంగా నన్ను మించిన వాడు లేడు.. అని విర్రవీగే వారికి ఏదో ఒక రోజు గర్వభంగం అవుతుంటుంది. ఇది మనుషుల విషయంలోనే కాకుండా జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది. అడవులకు రారాజు అయిన సింహం కూడా కొన్నిసార్లు కొన్ని జంతువుల ముందు తోక ముడవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పడుకున్న సింహాలను కనీసం టచ్ కూడా చేయకుండా ఖడ్గమృగాలు వణికించేశాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో సింహాలకు సంబంధించిన ఫన్నీ వీడియో (Funny viral video) తెగ వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతంలోని మట్టి రోడ్డులో రెండు పెద్ద సింహాలు (lions) పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. హాయిగా సేదతీరుతున్న సమయంలో వాటికి వెనుక నుంచి ఏదో చప్పుడు వినిపిస్తుంది. వెనక్కు తిరిగి చూస్తే.. ఇంకేముందీ.. రెండు అతి పెద్ద ఖడ్గమృగాలు (Rhinoceros) ఠీవీగా నడుచుకుంటూ వస్తుంటాయి. సాధరణంగా మిగతా జంతువులను చూడగానే దాడి చేసే సింహాలు.. ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాయి.

Wife-Husband: కూరగాయలు తెమ్మంటూ భర్తకు ఓ స్లిప్ ఇచ్చిందో భార్య.. ఆమె రాసింది చదివి నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

ఖడ్గమృగాలను చూసి సింహాలు.. ‘‘వామ్మో! ఈ టైమ్‌లో ఖడ్గమృగాలు ఇటొస్తున్నాయేంటీ.. ఇక్కడే ఉంటే మనం ఖతమైనట్లే’’.. అని అనుకుంటూ వెంటనే పైకి లేచి, గబా గబా రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి జారుకుంటాయి. ఖడ్గమృగాలు మాత్రం వాటిని ఏమాత్రం భయపెట్టకుండా.. ‘‘ఈమాత్రం భయం ఉండాలి మరి’’.. అని అన్నట్లుగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘సింహాలను చూస్తుంటే జాలేస్తోంది’’.. అని కొందరు, ‘‘ఖడ్గమృగమంటే ఆమాత్రం లేకపోతే ఎలా’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఒకే బైక్‌పై ముగ్గురు అమ్మాయిలు.. పోలీస్ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలకు.. ఈ యువతుల రెస్పాన్స్ వింటే..!

Updated Date - 2023-09-07T18:49:36+05:30 IST