Viral Video: ఇంటిని కొన్నందుకు పంట పండిందనుకున్నారు.. చివరకు గోడలు బద్ధలు కొట్టగా బయటపడిన వస్తువులు చూసి షాక్..

ABN , First Publish Date - 2023-09-07T21:42:17+05:30 IST

పాత ఇళ్లను కూల్చేసే సమయంలో పురాతన వస్తువులు, బంగారు నాణేలు తదితరాలు బయటపడడం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు అదే గోడల నుంచి పాములు, కొండచిలువలు కూడా బయటపడడం చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో...

Viral Video: ఇంటిని కొన్నందుకు పంట పండిందనుకున్నారు.. చివరకు గోడలు బద్ధలు కొట్టగా బయటపడిన వస్తువులు చూసి షాక్..

పాత ఇళ్లను కూల్చేసే సమయంలో పురాతన వస్తువులు, బంగారు నాణేలు తదితరాలు బయటపడడం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు అదే గోడల నుంచి పాములు, కొండచిలువలు కూడా బయటపడడం చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాియ. తాజాగా, ఓ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంటిని కొన్నందుకు పంట పండిందని ఓ జంట ఎంతో సంబరపడింది. తీరా గోడలు బద్ధలు కొట్టి చూడగా.. బయటపడిన వస్తువులు చూసి షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. న్యూజెర్సీలో (New Jersey) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ జంట.. కొన్ని నెలల కిందట ఓ ఇంటిని కొనుగోలు చేసింది. అయితే కొన్ని రోజులు ఇంట్లో ఉన్న తర్వాత సడన్‌గా ఆ ప్రాంతంలో వరదలు రావడంతో ఖాళీ చేయాల్సి వచ్చింది. వరదలు తగ్గుముఖం పట్టాక మళ్లీ తమ ఇంట్లోకి అడుగుపెట్టారు. బురదబయంగా మారిన ఇంటిని శుభ్రం చేస్తుండగా.. అండర్ గ్రౌండ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బురదను క్లీన్ చేస్తుండగా గోడల మధ్యలో ఏవే ఉన్నట్లు అనుమానం వచ్చింది. గోడ లోపలేమైనా మణులు, మాణిక్యాలేమైనా ఉన్నాయేమో అనుకుని ముందుగా వారు సంతోషపడ్డారు.

Future ATMs: భవిష్యత్తులో ఏటీఎంలు ఇలాగే ఉండబోతున్నాయ్.. డబ్బుల్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..!

అయితే తీరా గోడలకు ఉన్న చెక్కలను తొలగించి చూడగా.. షాకింగ్ దృశ్యం కంటపడింది. గోడల మధ్యలో ఖాళీ మద్యం సీసాలు (Empty liquor bottles) బయటపడ్డాయి. అవన్నీ రమ్ము సీసాలే కావడం చూసి ఇంటి యజమానులు అవాక్కయ్యారు. తీసేకొద్దీ గుట్టలు గుట్టలుగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వరదల్లో ఈ ఇంటిని వైన్ షాపు చేసేసినట్లున్నారు’’.. అని కొందరు, ‘‘ఖాళీ మద్యం బాటిళ్లు గోడలో దాయడమేంట్రా బాబూ’’.. అని మరికొందరు, ‘‘ఈ మందు ఎవడో మరీ ఫన్నీగా ఉన్నాడే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఒకే బైక్‌పై ముగ్గురు అమ్మాయిలు.. పోలీస్ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలకు.. ఈ యువతుల రెస్పాన్స్ వింటే..!

Updated Date - 2023-09-07T21:51:59+05:30 IST