Viral Video: ఈ దొంగను చూసి యముడికీ భయమేసినట్టుంది.. ట్రాక్టర్‌ను చోరీ చేద్దామని వెళ్లి సడన్‌గా టైరు కింద పడ్డాడు.. చివరికి..

ABN , First Publish Date - 2023-09-10T16:22:13+05:30 IST

కొందరు దొంగలు చోరీ చేసే విధానం చూస్తే.. మన కళ్లని మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. ఇంకొందరు దొంగల తెలివితేటలు చూసి చివరికి పోలీసులకే షాక్ అవుతుంటారు. అయితే అన్ని రోజులూ దొంగలవే ఉండవు. అప్పుడప్పుడూ చోరీ చేసే క్రమంలో..

Viral Video: ఈ దొంగను చూసి యముడికీ భయమేసినట్టుంది.. ట్రాక్టర్‌ను చోరీ చేద్దామని వెళ్లి సడన్‌గా టైరు కింద పడ్డాడు.. చివరికి..

కొందరు దొంగలు చోరీ చేసే విధానం చూస్తే.. మన కళ్లని మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. ఇంకొందరు దొంగల తెలివితేటలు చూసి చివరికి పోలీసులకే షాక్ అవుతుంటారు. అయితే అన్ని రోజులూ దొంగలవే ఉండవు. అప్పుడప్పుడూ చోరీ చేసే క్రమంలో దొంగలకూ షాక్ తగులుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ దొంగ ట్రాక్టర్‌ను చోరీ చేయబోయి చివరికి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ దొంగను చూసి యముడికీ భయమేసినట్టుంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఘటన గుజరాత్‌లో (Gujarat) చోటు చేసుకుంది. ఆగస్టు 31 అర్ధరాత్రి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో కొన్ని ట్రాక్టర్లు (Tractors) పార్కు చేసి ఉన్నాయి. ఆ సమయంలో వాటిపై కన్నేసిన ఓ దొంగ (thief Attempt to steal tractor) చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు. సైలెంట్‍‌గా ఓ ట్రాక్టర్ వద్దకు వెళ్లి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయినా బండి స్టార్ట్ కాదు. చివరికి ఏవేవో టెక్నిక్‌లు వాడి ఎలాగోలా ఇంజిన్‌ను స్టార్ట్ చేస్తాడు. అయితే అదే సమయంలో షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంటుంది. స్టార్ట్ అయిన టాక్టర్ పెద్ద టైరు కింద దొంగ కాలు ఇరుక్కుంటుంది. దీంతో అతను అటూ ఇటూ కదలలేని పరిస్థితి.

Viral Video: పామును చూసి మగాళ్లే భయపడి పారిపోతుంటే.. సడన్‌గా సీన్‌లోకి వచ్చిన యువతి.. చివరకు ఏం చేసిందో చూడండి..

మరోవైపు స్టార్ట్ అయిన ట్రాక్టర్.. దొంగను తొక్కించుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. అంత పెద్ద టైరు నలిగిపోయిన దొంగ ఇక పైకి లేవడం కష్టం అని అంతా అనుకుంటాం. కానీ టైరు మీద నుంచి వెళ్లిన కాసేపటికి తేరుకున్న దొంగ చివరికి పైకి లేచి ట్రాక్టర్ వైపు పరిగెత్తి పైకి ఎక్కి ఆపేస్తాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘యమలోకాన్ని మొత్తం ఎక్కడ చోరీ చేస్తాడో అని భయపడ్డట్టున్నారు’’.. అని కొందరు, ‘‘వీడి టైం అలా వుంది మరి’’.. అని మరికొందరు, ‘‘వామ్మో! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: చికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లగా రోగికి బదులుగా కోతి ప్రత్యక్షం.. అది చేసిన పని చూసి చివరకు అంతా షాక్..

Updated Date - 2023-09-10T16:23:54+05:30 IST