Viral Video: చికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లగా రోగికి బదులుగా కోతి ప్రత్యక్షం.. అది చేసిన పని చూసి చివరకు అంతా షాక్..

ABN , First Publish Date - 2023-09-10T15:08:16+05:30 IST

ఇళ్లల్లోకి చొరబడి పిల్లల చేతుల్లోని తినుబండారాలను ఎత్తుకెళ్లే కోతులను చూశాం.. అలాగే టూరిస్టులను బెదిరించి వారి వద్ద ఉన్న వస్తువులను లాక్కెళ్లే కోతులను చూశాం.. అలాగే కుక్క, పిల్లి ఇలా మిగతా జంతువులతో పిచ్చి పిచ్చి చేష్టలు చేసే కోతులను కూడా చూశాం. ఇలాంటి ...

Viral Video: చికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లగా రోగికి బదులుగా కోతి ప్రత్యక్షం.. అది చేసిన పని చూసి చివరకు అంతా షాక్..

ఇళ్లల్లోకి చొరబడి పిల్లల చేతుల్లోని తినుబండారాలను ఎత్తుకెళ్లే కోతులను చూశాం.. అలాగే టూరిస్టులను బెదిరించి వారి వద్ద ఉన్న వస్తువులను లాక్కెళ్లే కోతులను చూశాం.. అలాగే కుక్క, పిల్లి ఇలా మిగతా జంతువులతో పిచ్చి పిచ్చి చేష్టలు చేసే కోతులను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పెద్దాసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లోకి చొరబడిన కోతి వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

ఢిల్లీలోని (Delhi) రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి (Ram Manohar Lohia Hospital) ఆపరేషన్ థియేటర్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. రోజూ మాదిరే ఆ రోజు కూడా ఆస్పత్రి మొత్తం రోగులతో కిటకిటలాడుతోంది. మరోవైపు వైద్యులు న్యూరో సర్జరీ (Neurosurgery) విభాగంలోని రోగులకు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. సంబంధింత దుస్తులు వేసుకుని ఆపరేషన్ గదిలోకి ఎంటరైన వైద్యులకు షాకింగ్ సీన్ కనిపించింది. రోగులు ఉండాల్సిన ఆపరేషన్ గదిలో .. కోతి గెంతులేయడం చూసి అవాక్కయ్యారు. ఇన్ని గదులు దాటుకుని ఓ కోతి ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోకి (monkey entering operation theatre) రావడాన్ని వారు కాసేపు నమ్మలేకపోయారు. తర్వాత షాక్ నుంచి తేరుకుని దాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినా చాలా సేపు కోతి ఆ గదిలో అటూ ఇటూ వారిని పరుగులు పెట్టించి, తర్వాత బయటకు పారిపోయింది.

Viral Video: పామును చూసి మగాళ్లే భయపడి పారిపోతుంటే.. సడన్‌గా సీన్‌లోకి వచ్చిన యువతి.. చివరకు ఏం చేసిందో చూడండి..

కత్తులు పట్టుకుని ఆపరేషన్ చేయాల్సిన వైద్యులు, సిబ్బంది.. ఈ కారణంగా పొడవాటి కర్ర పట్టుకుని కోతిని తరమాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఎలాగోలా కోతి బయటికి వెళ్లిపోవడంతో రోగులతో పాటూ వైద్యులు హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుబండారాల కోసం వెతికిన కోతి ఆపరేషన్ గదిలో పరికరాలను చిందరవందరగా పడేయడం కనిపించింది. అయితే దాని కారణంగా రోగులెవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆపరేషన్ గదిలో ఎవరినైనా పరామర్శించేందుకు వచ్చిందేమో’’.. అని కొందరు, ‘‘పొరపాటు ఆ సమయంలో బెడ్‌పై రోగి ఉండుంటే పరిస్థితి ఏంటో’’.. అని ఇంకొందరు, ‘‘అయినా అంత పెద్ద ఆస్పత్రిలోకి అది కూడా ఆపరేషన్ థియేటర్‌లోకి ఓ కోతి అంత సులభంగా ఎలా వచ్చిందబ్బా’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే జరుగుతుంది.. అర్ధరాత్రి రోడ్డుపై ఈ యువతికి ఏమైందో చూడండి..

Updated Date - 2023-09-10T15:16:54+05:30 IST