Viral Video: చెబితే నమ్మరు గానీ.. టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. కాలు జారి ఇలా కింద పడ్డాడో లేదో.. అంతలోనే..

ABN , First Publish Date - 2023-09-12T15:02:31+05:30 IST

కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ కళ్ల ముందే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఆశ్చర్యకరంగా ఎవరికీ ఏమీ కాకపోవడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు..

Viral Video: చెబితే నమ్మరు గానీ.. టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. కాలు జారి ఇలా కింద పడ్డాడో లేదో.. అంతలోనే..

కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ కళ్ల ముందే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఆశ్చర్యకరంగా ఎవరికీ ఏమీ కాకపోవడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా.. చివరకు తీవ్ర విషాదం మిగులుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హోటల్‌లో టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. చూస్తుండగా కిందపడ్డాడు. చివరకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి విజయనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో (hotel) రవి (18) అనే వ్యక్తి పని చేస్తుండేవాడు. రోజూ లాగే ఆ రోజు కూడా పనికి వెళ్లాడు. పగలంతా హోటల్‌కి వచ్చిన వారికి సప్లై చేశాడు. రాత్రి సమయంలో హోటల్ మూసే ముందు టేబుల్స్ శుభ్రం చేయడం మొదలెట్టాడు. చివరగా ఓ టేబుల్ శుభ్రం చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంతవరకూ యాక్టివ్‌గా ఉన్న అతను.. టేబుల్‌ను పక్కకి లాగి శుభ్రం చేయడం మొదలెట్టగానే.. ఉన్నట్టుండి (young man fell down while cleaning table) ధమేల్‪‌మని కిందపడిపోయాడు.

Viral Video: అరే! ఏంటిది భయ్యా.. కొంచెం కూడా భయం లేదా.. పామును చూడగానే ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

కిందపడిన వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఎంతకీ పైకి లేవకపోవడంతో హోటల్ సిబ్బందికి కంగారుగా అక్కడికి వచ్చి అతన్ని పైకి లేపారు. ఎంత ప్రయత్నించినా అతనిలో చలనం లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో! పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అని కొందరు, ‘‘మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం.. అంటే ఇదేనేమో’’.. అని మరికొందరు, ‘‘ఇలా జరగడం బాధాకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మంచిదంటూ.. మట్టి కుండలో నెయ్యి వేసి పోపు పెడుతున్నారా.. అయితే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి..

Updated Date - 2023-09-12T15:02:31+05:30 IST