Viral Video: ఉన్నట్టుండి వరుడి మొఖంలో తేడా గమనించిన వధువు.. పక్కన ఉన్న వ్యక్తిని కూడా వదలకుండా చివరికి ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-09-12T16:38:43+05:30 IST

గతంలో ఎక్కడ, ఎంత పెద్ద వివాహం జరిగినా స్థానికులు నాలుగు రోజులు చర్చించుకుని తర్వాత మర్చిపోయేవారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న చిన్న పెళ్లిళ్ల గురించి కూడా స్థానికులు మొదలుకొని చివరకు ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఏ కార్యక్రమంలో అయినా ఏమాత్రం..

Viral Video: ఉన్నట్టుండి వరుడి మొఖంలో తేడా గమనించిన వధువు.. పక్కన ఉన్న వ్యక్తిని కూడా వదలకుండా చివరికి ఏం చేసిందో చూడండి..

గతంలో ఎక్కడ, ఎంత పెద్ద వివాహం జరిగినా స్థానికులు నాలుగు రోజులు చర్చించుకుని తర్వాత మర్చిపోయేవారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న చిన్న పెళ్లిళ్ల గురించి కూడా స్థానికులు మొదలుకొని చివరకు ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఏ కార్యక్రమంలో అయినా ఏమాత్రం వింత ఘటన జరిగినా ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వధువు తన పక్కన కూర్చున్న వరుడి మొఖంలో ఏదో తేడా గమనించింది. చివరకు ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బంధవులందరి సమక్షంలో వధూవరులు (bride and groom) పీటలపై కూర్చుని ఉండగా.. పురోహితులు వివాహం తంతును జరిపిస్తుంటారు. అయితే ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వరుడు వెరైటీగా నోట్లో గుట్కా వేసుకుని (Groom chewing gutka) మంటపం పైకి వస్తాడు. అయితే ముందు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. గుట్కా నములుతూ సరిగ్గా మాట్లాడకపోయేసరికి.. తర్వాత వధువుకు అనుమానం కలుగుతుంది. చివరకు విషయం తెలుసుకుని అతడిపై సీరియస్ అవుతుంది. అంతలో పక్కన ఉన్న ఓ యువకుడు ఏదో సర్దిచెప్పబోతాడు.

Viral Video: మంచిదంటూ.. మట్టి కుండలో నెయ్యి వేసి పోపు పెడుతున్నారా.. అయితే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి..

దీంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న వధువు.. సదరు యువకుడిపై చేయి చేసుకుంటుంది. తర్వాత వరుడిని (Bride attack on groom) కూడా గట్టిగా కొడుతుంది. ‘‘పక్కకు వెళ్లి గుట్కా మూసి వస్తావా.. లేక కాలితో తన్నమంటావా’’.. అని చివరిసారిగా గట్టిగా హెచ్చరిస్తుంది. దీంతో భయపడిపోయిన వరుడు.. వెంటనై పైకి లేచి పక్కకు తిరిగి గుట్కాను ఉమ్మేస్తాడు. ఈ ఘటనతో పక్కన ఉన్న వారంతా పకపకా నవ్వుకుంటారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ వరుడు చాలా వెరైటీగా ఉన్నాడే’’.. అని కొందరు, ‘‘భర్తను బాగానే కంట్రోల్ చేసింది’’.. అని మరికొందరు, ‘‘ఇక జీవితంలో గుట్కా వేసుకోడేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చెబితే నమ్మరు గానీ.. టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. కాలు జారి ఇలా కింద పడ్డాడో లేదో.. అంతలోనే..

Updated Date - 2023-09-12T16:39:56+05:30 IST