సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఉద్ఘాటించారు.
కడియం శ్రీహరికి ఘన్పూర్ అభివృద్ది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్‌పూర్‌లో కడియం మార్క్ ఎక్కడా కనిపించదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
వరంగల్ నగరంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీలు, ఖాళీ ప్లాట్లు, చెరువులు, కుంటలలో నీరు నిలిచి ఉండడం వల్ల దోమల లార్వా వృద్ధి చెంది ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
జిల్లాలో కొత్త రేషన్‌కార్డులు పొందిన పేదలకు సెప్టెంబర్ నెల నుంచి సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుదారుకుల రేషన్ కోటా కూడా కేటాయించి, విడుదల చేశారు. దీంతో వచ్చేనెల నుంచి కొత్త కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాబోయే మేడారం మహా జాతరకు రూ.150 కోట్ల కేటాయింపు
భారీ వర్షాల కారణంగా రోడ్లు, బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్లు జలమయం అవుతున్నాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తూ.. చర్యలు చేపడుతుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూసి బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలందరూ.. అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.