Warangal: బీఆర్‌ఎస్ గద్దెలు కూల్చితే యుద్ధమే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:28 PM
మా పార్టీ గద్దెలను టచ్ చేస్తే... యుద్ధమేనని పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను సీఎంనన్న సంగతి కూడా మరిచిపోయి మాట్లాడుతున్నారంటా వ్యాఖ్యానించారు. ఇంకా వారు ఏమన్నారంటే...
- ఖమ్మంలో సీఎం వ్యాఖ్యలు అప్రజాస్వామికం
- మాజీ ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, ధర్మారెడ్డి
- పోలీస్ కమిషనర్‌కు సీఎంపై ఫిర్యాదు
వరంగల్: ఖమ్మంలో జరిగిన సీపీఐ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) బీఆర్‌ఎస్ గద్దెలను కూల్చివేయాలని చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ దిమ్మలను ముట్టుకుంటే రేవంత్‌రెడ్డి సంగతి తేలుస్తామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌ను కలిసి బీఆర్‌ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నాటి టీఆర్‌ఎస్ నేటి బీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ప్రజలు గులాబీ జెండాతో ఉద్యమాలు చేస్తుంటే సమైక్య ఆంధ్ర పార్టీలో ఉన్న రేవంత్‌రెడ్డి తుపాకులతో బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను ముట్టుకుంటే మానుకోట రాళ్లతో కాంగ్రెస్ నాయ కులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ... ఎవరి జెండాలు ఎవరి ఎజెండాలు వారికే ఉంటాయని ఒక పార్టీ జెండా కూల్చివేస్తే ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, పులి రజినీకాంత్, కె. సదాంత్, తక్కళ్లపెల్లి వినీల్‌రావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News