Medaram: మేడారంలో.. ముందస్తు మొక్కులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:22 PM
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి తమ మొక్కులను చెల్లంచుకుంటున్నారు. ఈనెల 28 నుంచి మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. అప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో ముందస్తుగానే విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
- భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
- రద్దీగా మారిన వనదేవతల గద్దెలు
తాడ్వాయి(ములుగు): ములు గు జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram)లో వనదేవతలు సమ్మక్క- సారలమ్మలకు భక్తుల మొక్కులు జోరుగా కొనసాగుతున్నాయి. సోమ వారం కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతరకు ముందుగానే మేడారం వస్తున్న భక్తులు తల్లుల గద్దెలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి యాట మొక్కులు చెల్లిం చారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నా నాలు ఆచరించి కల్యాణ కట్టల్లో తలనీలాలు సమర్పించుకున్నారు.

శివసత్తు పూనకాలతో వనదేవతలకు జేజేలు పలుకుతూ గద్దెల వద్ద కు చేరుకున్నారు. తల్లులను తాకి ఒడిబియ్యం పోసి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీరలు, కొబ్బరికాయలు, సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లి చల్లంగా చూడాలని వేడుకున్నారు. సోమవారం సుమారు లక్ష మందికి పైగా భక్తులు సోమవారం అమ్మవా ర్లను దర్శించుకున్నారని దేవాదాయ, పోలీసు శాఖల అధికారులు అంచానాలు వేశారు.
ఎత్తు నాణాలు సమర్పణ..
మేడారం వనదేవతలకు ఓ భక్తురాలు ఎత్తు నాణాలు సమర్పించి వినూత్నంగా మొక్కును సమర్పించుకున్నారు. సమ్మక్క-సారలమ్మలకు భక్తులు ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించ డం సహజం. మొదటిసారిగా ఖమ్మం పట్టణా నికి చెందిన భాగ్య అనే యువతి మొక్కులో భాగంగా ఎత్తు నాణాలు సుమారు రూ.లక్షా 50వేలు సమర్పించారు. ఆ మొత్తాన్ని అధికారు లు భక్తులతో హుండీలలో వేయించారు.
జంపన్నవాగులో రెస్క్యూ టీమ్..
మేడారం వనదేవతలు సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవడానికి తరలివచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో ప్రమాద స్థలాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెస్క్యూ సిబ్బందిని అధికారులు భద్రత కోసం నియమించారు. ఈ క్రమంలో వాగులో ట్యూబ్ పడవతో వారు విధులు నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News