Share News

CM Revanth Reddy: నాకు ఏదైనా ఆపద వస్తే మేడారం అమ్మవార్లు గుర్తొస్తారు.. సీఎం భావోద్వేగం..

ABN , Publish Date - Jan 18 , 2026 | 09:50 PM

తనకు ఏదైనా ఆపద వస్తే మొదటగా తాను నిర్మించిన సమ్మక్క - సారలమ్మ ఆలయం గుర్తొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి, కుంభమేళా స్థాయిలో మేడారంలో నిత్యం వసతి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

CM Revanth Reddy: నాకు ఏదైనా ఆపద వస్తే  మేడారం అమ్మవార్లు గుర్తొస్తారు.. సీఎం భావోద్వేగం..
Telangana CM Revanth Reddy

మేడారం, జనవరి18 (ఆంధ్రజ్యోతి): తనకు ఏదైనా ఆపద వస్తే మొదటగా తాను నిర్మించిన సమ్మక్క - సారలమ్మ ఆలయం గుర్తొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తిరుపతి, కుంభమేళా స్థాయిలో మేడారంలో నిత్యం వసతి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం మేడారం సమ్మక్క- సారలమ్మ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.


జంపన్నవాగును మరింత అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. జంపన్నవాగులో శాశ్వతంగా నీరు ఉండేలా చూస్తామన్నారు. సమ్మక్క - సారలమ్మ చెంతన మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. వీరత్వమే దైవత్వంగా మారిన ప్రదేశం మేడారమని వెల్లడించారు. కాకతీయులపై కత్తి దూసిన వీరవనితలు సమ్మక్క-సారలమ్మ అని కీర్తించారు. హాత్ సే హాత్ జోడోయాత్ర ఇక్కడ నుంచే ప్రారంభించానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క - సారలమ్మను దక్షిణాది కుంభమేళాగా తీర్చిదిద్దామని వివరించారు. మంత్రులు సీతక్క - సురేఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు జరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

For More TG News And Telugu News

Updated Date - Jan 18 , 2026 | 09:55 PM