Share News

Medaram: మేడారంలో కొనసాగుతున్న ముందస్తు మొక్కులు..

ABN , Publish Date - Jan 14 , 2026 | 10:01 AM

సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా 15 రోజుల గడువు ఉన్నప్పటికీ ప్రస్తుతం మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 30 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.

Medaram: మేడారంలో కొనసాగుతున్న ముందస్తు మొక్కులు..

- 30వేల మందికి పైగా తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి(ములుగు): మేడారం(Medaram)లో వనదే వతలు సమ్మక్క-సారలమ్మలను భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. తల్లుల గద్దెలకు పూజలు చేసి కోరికలు తీరాలని వేడుకున్నారు. ప్రకృతి దేవతలుగా కొలువైన అమ్మ వార్లను దర్శించుకుని పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, చీరె సారె, ఎత్తు బంగారం(బెల్లం), కొబ్బరికాయలు, యాట మొక్కులు సమర్పించుకున్నారు. 30వేల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికా రులు తెలిపారు. భక్తుల రాకతో గద్దెల పరిసరాలు, దేవస్థా నం ప్రాంగణం రద్దీగా మారాయి.

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలతో డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, సమ్మక్క- సారలమ్మల నామస్మరణల తో మేడారం పరిసరాలు, దేవస్థానం మార్మోగింది. వనదేవ తలను దర్శించుకున్న భక్తులు పరిసరాల్లో విడిది చేసి బంధుమిత్రులతో విందు భోజనాలు చేశారు.


medaram1.2.jfif

రోడ్లపై దుబ్బ తొలగింపు..

తాడ్వాయి: మహాజాతర సందర్భం గా జరుగుతున్న అభివృద్ధి పనులతో రోడ్డు మట్టి, దుబ్బతో నిండిపోయాయి. దీంతో పారిశుధ్య కార్మికుల ద్వారా అధికారులు రోడ్లపై ఉన్న దుబ్బను తొలగించారు. అంతేకాకుండా రోడ్లు శుభ్రం చేసే ప్రత్యేక యంత్రాలతో రాత్రి సమయాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని డీపీవో వెంకయ్య తెలిపారు. అదనపు కార్మికులతో ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తున్నామని అన్నారు.


దేవస్థానంలో పూజిత వృక్షాలు

తాడ్వాయి: మేడారం దేవస్థానంలో వ నదేవతల దేవతా వృక్షాలు, పూజి త వృక్షాలను భక్తులకు తెలిసేలా అధికారులు నాటుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సమ్మ క్క- సారలమ్మల గద్దెల దేవస్థా నం పరిసరాల్లో అధికారులు వృ క్షాలను నాటారు. దేవస్థానం ఆ ధునికీకరణ పనుల్లో భాగంగా చే పట్టిన అభివృద్ధి పనుల్లో ఈ వృక్షా లను అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.


medaram1.3.jpg

మొబైల్‌ మరుగుదొడ్లు..

తాడ్వాయి: మేడారానికి మందస్తుగా తరలివస్తున్న మహిళా భక్తుల కోసం అధికారులు మొబైల్‌ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్‌, దేవస్థానం పరిసరాలు, జంపన్నవాగు, చిలకలగుట్ట, దేవస్థానం సమీపంలోని పార్కింగ్‌ వద్ద వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సౌకర్యాల నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో ఈ మొబైల్‌ మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.


చిలకల గుట్టకు దారి..

తాడ్వాయి: మహాజాతర సందర్భం గా సమ్మక్క గద్దెకు వచ్చే చిలకలగద్దె(Chilakalagutta) దారిని అధికారులు కార్మికులతో మంగళవారం శుభ్రం చేశారు. ఈ నెల 29న సమ్మక్క దేవత ప్రభుత్వ లాంఛనాలతో గద్దెకు చేరుకోవడం తెలిసిందే. అయితే రెండు సంవత్సరాలుగా గేటు మూసి ఉండటంతో గుట్టకు వెళ్లేదారిలో పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. మహాజాతర ఏర్పాట్లలో భాగంగా అధికారులు సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2026 | 10:03 AM