Gade Innaiah: గాదె ఇన్నయ్యకు బెయిల్ మంజూరు
ABN , Publish Date - Jan 16 , 2026 | 07:01 PM
సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన విడుదల కానున్నారు.
జనగామ, జనవరి 16: యూపీఏ చట్టం కింద ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఆయనకు షరతులతో కూడిన 48 గంటల తాత్కాలిక బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.
గాదె ఇన్నయ్య తల్లి థెరీసా (93) గురువారం రాత్రి మరణించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. శనివారం జనగామ జిల్లాలోని జాఫర్‌గఢ్ మండలం సాగరంలో ఆయన తల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. అందులో గాదె ఇన్నయ్య పాల్గొనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత కాటా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. ఆయన అంత్యక్రియలకు మావోయిస్టు మాజీ నేత గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను.. ప్రేరేపించారే ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఉపా (UAPA) చట్టం కింద ఆయనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఆ క్రమంలో డిసెంబర్ 21న ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. మంగళవారం జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్యామలా నవరాత్రులు.. ఎప్పటి నుంచంటే..
For More TG News And Telugu News